Cm Revanth Reddy to jail on July 14

Cm Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పార్లమెంట్ ఎన్నికలను మూడు పార్టీలకు చాలా కీలకంగా మారాయి. మొన్నటికి మొన్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోకపోతే ప్రజల్లో అసంతృప్తి కచ్చితంగా బయటపడుతుంది. అటు ఉద్యమ పార్టీ అయిన గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. Cm Revanth Reddy

Cm Revanth Reddy to jail on July 14

మళ్లీ ఆ పార్టీ పుంజుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 6 నుంచి 10 సీట్ల మధ్య గెలుచుకోవాలి. లేకపోతే గులాబీ పార్టీ లో ఉన్న కీలక లీడర్లు అంతా బయటకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇటు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సంపాదించిన బిజెపి పార్టీ… గతంలో గెలిచిన ఎంపీ సీట్ల కంటే ఎక్కువ గెలవాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తోంది. ఓవరాల్ గా 400 సీట్లు లక్షంగా బిజెపి పార్టీ ప్రచారం కొనసాగుతోంది. Cm Revanth Reddy

Also Read: Telangana: తెలంగాణలోనూ వాలంటీర్ల వ్య‌వస్థ? రేవంత్‌ కు షాక్‌ తప్పదా ?

ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీ కంటే రేవంత్ రెడ్డిని ఎక్కువగా టార్గెట్ చేస్తోంది బిజెపి పార్టీ. మోడీ నుంచి బండి సంజయ్ వరకు అందరూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. తెలంగాణలో ఆర్ఆర్ఆర్ టాక్స్ నడుస్తోందని… ప్రతి పనిలో రేవంత్ రెడ్డికి అలాగే రాహుల్ గాంధీకి కమిషన్ వెళ్తోందని బిజెపి నిత్యo ఆరోపణలు చేస్తుంది. అయితే తాజాగా నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఒక అడుగు ముందుకు వేసి… సీఎం రేవంత్ రెడ్డిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. Cm Revanth Reddy

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తాడని ధర్మపురి అరవింద్ ఆరోపణలు చేశారు. జూన్ 14వ తేదీ రాగానే.. సుప్రీంకోర్టు ఓటుకు నోటు కేసులో తీర్పు ఇస్తుందని… ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి జైలుకు వెళ్తాడని హెచ్చరించారు ధర్మపురి అరవింద్. దీంతో కాంగ్రెస్ నేతలు అంతా పండగ చేసుకుంటున్నారని… జూన్ 14వ తేదీ ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారని ఆయన రెచ్చగొట్టారు. Cm Revanth Reddy

కాగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు స్టీఫెన్ సన్ అనే ఎమ్మెల్యేని కొనుగోలు చేసేందుకు రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తూ దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసు రేవంత్ రెడ్డిని ఇంకా వెంటాడుతూనే ఉంది. అయితే దీనిపై సుప్రీంకోర్టు జూన్ 14వ తేదీన తీర్పు ఇవ్వనుంది. ఈ తరుణంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. Cm Revanth Reddy

Join WhatsApp