Congress chief YS Sharmila focus on vijayawada and guntur

Ys Sharmila: ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. మొన్నటి వరకు త్రిముఖ పోరుగా ఉన్న ఏపీ రాజకీయాలు… ఇప్పుడు రంగంలోకి నాలుగు పార్టీలు దిగాయి. గతంలో ఏపీలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్లీ పుంజుకునే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇటీవల ఏపీ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులుగా వైఎస్ షర్మిల నియామకమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె బాధ్యతలు కూడా చేపట్టారు.

Congress chief YS Sharmila focus on vijayawada and guntur

ఇక షర్మిల బాధ్యతలు చేపట్టక ముందే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేయడం మొదలు పెట్టేశారు. అటు చంద్రబాబును కూడా కడిగి పారేశారు షర్మిల. దీంతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఏపీలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వైఎస్ షర్మిల పోటీ చేసే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే మొన్నటి వరకు పులివెందుల నుంచి షర్మిల పోటీ చేస్తారని కొంతమంది ప్రచారం చేశారు.

పులివెందుల.. సీఎం జగన్మోహన్ రెడ్డికి కంచుకోట లాంటిది. అలాంటి నియోజకవర్గంలో షర్మిల పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతుంది. దీంతో ఆమె విజయవాడ తూర్పు మరియు గుంటూరు పశ్చిమ సీట్లపై ఫోకస్ చేశారట. విజయవాడ తూర్పు మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు గెలిచింది. అక్కడ వేలాది సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. అయితే ఏపీ విభజన తర్వాత ఇతర పార్టీలోకి కాంగ్రెస్ నేతలు అందరూ వెళ్ళిపోయారు.

Also Read: BRS: మళ్లీ విజృంభిస్తున్న గులాబీ పార్టీ… లోక్ సభ ఎన్నికల సర్వేలో BRS కు మెజారిటీ సీట్లు ?

అయితే షర్మిల రాకతో వారందరూ మళ్ళీ కాంగ్రెస్లో చేరేందుకు సంసిద్ధమైనట్టు తెలుస్తోంది. దీంతో ఈ రెండు నియోజకవర్గాలలో ఏదో ఒకటి ఎంచుకొని పోటీ చేయాలని షర్మిల నిర్ణయం తీసుకున్నారట. షర్మిల బరిలోకి దిగితే కచ్చితంగా ఈ నియోజకవర్గంలో గెలుస్తారని సర్వేలు కూడా చెబుతున్నాయి. దీంతో ఆమె విజయవాడ తూర్పు లేదా గుంటూరు పశ్చిమ సీట్లను ఫోకస్ చేశారట. (Ys Sharmila)

Join WhatsApp