Venkatesh: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. మే 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చవిచూసిన గులాబీ పార్టీ ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికల్లో పది సీట్లు గెలిచేలా ప్లాన్ చేస్తోంది గులాబీ పార్టీ. అటు బిజెపి పార్టీ కూడా ఎక్కువ సీట్లు గెలిచేలా ముందుకు సాగుతోంది. Venkatesh

Congress party blames Venkatesh

ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రచారంలో ఏమాత్రం ముందుకు వెళ్లడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… పార్లమెంటు ఎన్నికలను అసలు పట్టించుకోవడం లేదు. గెలిచే సీట్లలో కూడా ప్రచారాన్ని గాలికి వదిలేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు. దానికి ముఖ్య ఉదాహరణ ఖమ్మం నియోజకవర్గం. Venkatesh

Also Read: KCR: కడియం శ్రీహరి జీవితంతో ఓ ఆట ఆడుకుంటున్న కేసీఆర్ ?

ఖమ్మం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది. అక్కడ భద్రాచలం తప్ప అన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇటీవల భద్రాచలం ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలాంటి నేపథ్యంలో… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రామ సహాయం రఘురామిరెడ్డికి ఖమ్మం కాంగ్రెస్ అగ్ర నేతలు అస్సలు సపోర్ట్ చేయడం లేదట. Venkatesh

తన భార్యకు టికెట్ ఇవ్వలేదని బట్టి విక్రమార్క అలిగాడట. అలాగే తన తమ్ముడికి ఎంపీ టికెట్ ఇవ్వలేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడట. అటు తుమ్మల నాగేశ్వరరావు… తన సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇవ్వాలని మొదటి నుంచి డిమాండ్ చేశారు. కానీ టికెట్ విక్టరీ వెంకటేష్ వియ్యంకుడు అయినా రామసహాయం రఘురామిరెడ్డికి ఇచ్చారు. Venkatesh

దీంతో… బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు తుమ్మల నాగేశ్వరరావు మధ్య కాస్త గ్యాప్ పెరిగిందట. అలాగే కార్యకర్తల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయట. ఒకరి కారణంగా మరొకరికి టికెట్ రాలేదని ఈ ముగ్గురు నేతలు… అసంతృప్తిగా ఉన్నారట. బట్టి విక్రమార్క, తుమ్మల మరియు పొంగులేటి వివాదం కారణంగా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి విజయం కష్టమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన కోసం ఈ ముగ్గురు లీడర్లు ప్రచారం సరిగా చేయడం లేదని అంటున్నారు. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే కంచుకోట ఆయన ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి బీటలు రావడం ఖాయమని అంటున్నారు. కాగా విక్టరీ వెంకటేష్ కూతురిని ఖమ్మం అభ్యర్థి కొడుకు ఇచ్చి పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. Venkatesh

Join WhatsApp