Do people believe in R.S.Praveen Kumar

R.S.Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈయన పేరు చెప్పగానే ఎన్నో గొప్ప ఆలోచనలు, ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఘటనలు, అంతకుమించి బహుజన వాదం ద్వారా బహుజనులంతా ఏకమవ్వాలని ఆయన చేసిన కృషి గుర్తుకొస్తుంది. అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2021లో తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చివరికి బిఎస్పి పార్టీని తెలంగాణలో నడిపిస్తూ ఆ పార్టీకి చీఫ్ గా వ్యవహరించారు. ఎంతోమంది కార్యకర్తలను తయారు చేసిన ఆయన బహుజనులంతా ఏకం కావాలనే నినాదంతో ముందుకు సాగుతూ వచ్చారు.

Do people believe in R.S.Praveen Kumar

దీంతో ఆయన ఆలోచనలను కూడా చాలామంది బహుజనులు నమ్మారు. కానీ చివరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో దోస్తీ కట్టి బీపిఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. దీంతో కేసీఆర్ ఆయనకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ టికెట్ కూడా ఖరారు చేశారు. ఈ విధంగా కేసీఆర్ ఇద్దరు హై క్యాడర్ ఆఫీసర్లకు టికెట్లు కేటాయించారని చెప్పవచ్చు. మరో వ్యక్తి మాజీ ఐఏఎస్ అధికారి పి. వెంకట్రామిరెడ్డిని కూడా మెదక్ పార్లమెంట్ బరిలో దించుతున్నారు. (R.S.Praveen Kumar)

Also Read: Ponguleti Srinivas: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా మంత్రి పొంగులేటి..మరో ఏక్‌ నాథ్‌ షిండే ?

ఇవన్నీ పక్కన పెడితే బీసీ బిడ్డలంతా ఏకం కావాలని , రెడ్డి, రావుల రాజ్యం పోవాలనే నినాదంతో గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనే రాష్ట్రాన్ని చెడగొడుతుందని ఎన్నో ఆరోపణలు చేశారు. ఈ విధంగా అగ్గి మీద గుగ్గిలంలా ఉండే వీరిద్దరూ ఒకేసారి కలిసిపోవడంతో బిఎస్పి పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలంతా అయోమయంలో పడ్డట్టు తెలుస్తోంది. మమ్మల్ని నట్టేట ముంచి ఆయన పూల దారి చూసుకున్నారని, ఆ పార్టీలోకి వెళ్లడానికి ఎంత తీసుకున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

Do people believe in R.S.Praveen Kumar

అటు బీఎస్పీలో ఉండలేక, ఇటు వేరే పార్టీలోకి వెళ్లలేక తలామునకలవుతున్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ లోకి తీసుకెళ్తే బహుజనులంతా బీఆర్ఎస్ వైపు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నారు. కానీ ఇది జరిగే పనేనా.. ఎంతో మేధాశక్తి కలిగినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనూహ్యంగా పార్టీ మార్పు కావడంతో బహుజనులందరిలో కాస్త అసమ్మతి భావం ఏర్పడింది. ఈ క్రమంలోనే పార్లమెంటు ఎలక్షన్స్ లో ఆర్ఎస్పీకి సపోర్టు చాలా తక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.(R.S.Praveen Kumar)

Join WhatsApp