Election Commission Released AP Voter Final List 2024

AP Voter: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏపీలో ఓటర్ల తుది జాబితాను విడుద‌ల చేసింది. ఈ జాబితాలో ఓటర్ల సంఖ్య 4,08,07,256కు చేరింది. గతేడాది అక్టోబర్ 27న రిలీజ్ చేసిన‌ ముసాయిదా జాబితా తర్వాత 5,86,530 మంది ఓటర్లు పెరిగారు. మొత్తం ఓట‌ర్ల జాబితాలో పురుషుల కంటే స్త్రీలే అధికంగా ఉన్నారు.

Election Commission Released AP Voter Final List 2024

పురుషులు 2,00,09,275 మంది కాగా.. 2,07,37,065 మంది మ‌హిళా ఓట‌ర్లు ఉన్నారు. అలాగే 3,482 థర్డ్ జెండర్స్ మ‌రియు 67,434 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. 5.8 లక్షల మందికి ఓట్ ఫ్రంట్ హోమ్ అవకాశం కల్పిస్తామన్నారు. అంటే ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా మీడియాతో వెల్ల‌డించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మొద‌టిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు 7.88 లక్షల మంది ఉన్న‌ట్లు తెలిపారు.

Also Read: CM Jagan: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీఎం.. నేడే నాలుగో విడత డబ్బు జమ..!!

అంతేకాకుండా.. ఇంటింటికి సర్వే ద్వారా మొత్తం 16, 52,422 ఓట్లు తొలగించారు. ఇక‌పోతే ఏపీ ఓట‌ర్ల తుది జాబితాలోను https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html లో ఎన్నిక‌ల సంగం అప్లోడ్ చేసింది. రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలను అందుబాటులో ఉంచారు. అందులో మీ పేరు ఉందా..? లేదా..? అన్న‌ది ఈజీగా తెలుసుకోవ‌చ్చు. అందుకోసం ఈజీ అధికారిక వెబ్ సైట్ https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html ఓపెన్ చేయాలి. (AP Voter Final List)

Election Commission Released AP Voter Final List 2024

హోమ్ పేజీలోని క‌నిపిస్తున్న ఎస్ఎస్ఆర్-2024 లింక్ పై క్లిక్ చేయాలి. అప్పుడు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో సెర్చ్ యువర్ నేమ్ లో మీ వివరాలు ఎంట‌ర్‌ చేసి ఓటు చెక్ చేసుకోవచ్చు. మీ గ్రామం ఓటర్ జాబితాను కూడా ఈ వెబ్ సైట్ లో తెలుసుకోవ‌చ్చు. కాగా, యువత ఓటు హక్కు నమోదు చేసుకునేలా ఎన్నిక‌ల సంఘం మంగళవారం నుంచి విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రత్యేక డ్రైవ్‌ ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు. అలాగే మరోవైపు ఓటర్ల తుది జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిష్కారానికి సచివాలయంలో కూడా ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తున్నారు.

Join WhatsApp