Four BRS MLAs meet Chief Minister Revanth Reddy, termed it as courtesy call

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి దాదాపు రెండు నెలలు కావస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నిన్న సాయంత్రం పెను సంచలనం చోటుచేసుకుంది. బలమైన ప్రతిపక్ష పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి కి చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.

Four BRS MLAs meet Chief Minister Revanth Reddy

నిన్న సాయంత్రం ఒకేసారి నలుగురు భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరియు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఈ నలుగురు కలిసి నిన్న రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు. దీంతో ఈ నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

Also Read: Ys Sharmila: జగన్‌ ను చూసి భయపడ్డ షర్మిల.. పులివెందుల నుంచి ఔట్‌ ?

విదేశాల నుంచి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తన ఆట మొదలుపెట్టినట్లు… ఇక బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ తీవ్ర గందరగోల పరిస్థితిపై స్వయంగా రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు.

Four BRS MLAs meet Chief Minister Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశామని… మెదక్ జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ సమస్య తలెత్తుతుందని… ఈ సందర్భంగా వివరించారు. తమకు భవిష్యత్తులో ప్రోటో కాల్ సమస్య రాకుండా… చూడాలని రేవంత్ రెడ్డిని కోరినట్లు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తాము గులాబీ పార్టీలో ఉంటామని… పిచ్చిపిచ్చి వార్తలు రాయకండి అని ఫైర్ అయ్యారు సదరు ఎమ్మెల్యేలు. అంతేకాదు ఇవాళ తెలంగాణ భవన్లో ఈ నలుగురు ఎమ్మెల్యేలు… ప్రెస్ మీట్ పెట్టి మరి ఇదే విషయాన్ని చెప్పబోతున్నారు. (Revanth Reddy)

Join WhatsApp