Glass Symbol Tension For bjp janasena and tdp then ycp will win 50 seats

Glass Symbol Tension: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ఏపీలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం అన్ని పార్టీలను తొక్కుకుంటూ ముందుకు వెళ్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. Glass Symbol Tension

Glass Symbol Tension For bjp janasena and tdp then ycp will win 50 seats

అయితే జగన్మోహన్ రెడ్డినీ ఓడించేందుకు జనసేన, తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీలు త్రిముక వ్యూహంతో ముందుకు వెళుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే ఈ కూటమికి ఊహించని షాక్ తగిలింది. కర్ణుడు చావుకు వంద కారణాలు ఉన్నట్లు… తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు గ్లాస్ గుర్తు విలన్ గా మారిపోయింది. అవును జనసేన, తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీలు విజయానికి గ్లాస్‌ గుర్తు విలన్‌ అయింది. Glass Symbol Tension

Also Read: KCR: కడియం శ్రీహరి జీవితంతో ఓ ఆట ఆడుకుంటున్న కేసీఆర్ ?

జనసేన, తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీల కూటమి అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు గండంగా మారింది. మొత్తం 50కి పైగా సెగ్మెంట్లల్లో కూటమి అభ్యర్థులకు గ్లాస్ ఫియర్ నెలకొంది. ఆంధ్ర ప్రదేశ్‌ మొత్తంలో 50కి పైగా సెగ్మెంట్లల్లో చాలా మంది స్వతంత్ర్య అభ్యర్థులకు గ్లాస్‌ గుర్తు కేటాయించారు ఎన్నికల అధికారులు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని టీడీపీ అభ్యర్థులను భయపెడుతోంది గ్లాస్ గుర్తు. గాజు గ్లాస్ గుర్తు దక్కించుకున్న కొందరు అభ్యర్థులకు వైసీపీ అభ్యర్థుల తెర వెనుక సాయం అందినట్లు సమాచారం. Glass Symbol Tension

గాజు గ్లాస్ గుర్తును ప్రమోట్ చేసేలా ఇండిపెండెంట్లకు చేయూతనిస్తున్నారట పలువురు వైసీపీ అభ్యర్థులు. గ్లాస్ గుర్తుని దక్కించుకున్న స్వతంత్రులను సైలెంట్ చేసే పనిలో టీడీపీ అభ్యర్ఖులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీంతో గాజు గ్లాస్ గుర్తు దక్కించుకున్న స్వతంత్రులకు పెరిగింది డిమాండ్. స్వతంత్ర్య అభ్యర్థికి గ్లాస్‌ గుర్తు ఉంటే…కూటమి ఓటు చీలిపోవడం ఖాయం. దీంతో మరి ఈ గ్లాస్‌ గండం నుంచి జనసేన, తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీలు ఎలా బయట పడతాయో చూడాలి. Glass Symbol Tension

Join WhatsApp