Growing Differences Over Janasena, TDP Alliance

TDP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో… తెలుగుదేశం మరియు జనసేన పార్టీల మధ్య గొడవలు తెర పైకి వస్తున్నాయి. ఏదో ఒక కారణం చేత తెలుగుదేశం మరియు జనసేన పార్టీలో మధ్య… గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న రెండు అసెంబ్లీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన అంశంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మం పాటించడం లేదని పవన్ కళ్యాణ్ మీడియా ముందు వెల్లడించారు.

Growing Differences Over Janasena, TDP Alliance

ఈ తరుణంలోని తాను కూడా రెండు సీట్లు ప్రకటిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని మొన్న నారా లోకేష్ చేసిన కామెంట్స్ పై కూడా… సున్నితంగా పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏపీ ప్రజల కోసం అన్ని భరిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే తాజాగా తెలుగుదేశం మరియు జనసేన పార్టీ పొత్తుపై మాజీ మంత్రి హరిహర జోగయ్య ఓ లేఖ రాసి పెను సంచలనానికి దారి తీశారు.

జనసేన పార్టీ మనుగడపై దెబ్బ కొట్టే ప్రయత్నం టిడిపి చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు జనసేన పార్టీకి 25 నుంచి 30 సీట్లు ఇవ్వడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖ విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ రాజకీయాలలో జనసేన పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని ఆయన వెల్లడించారు. గతంలో 137 స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేసి.. ఇప్పుడు మరింత ఉత్సాహంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ALSO READ: Pawan Kalyan: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ దోస్తానా కటీఫ్ ?

ఇలాంటి నేపథ్యంలో… పొత్తులో భాగంగా 25 నుంచి 30 సీట్లు ఇస్తే… అది విఫల ప్రయత్నం అవుతుందని.. పవన్ కళ్యాణ్ గొంతు నొక్కి ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇక హరి రామ జోగయ్య విడుదల చేసిన లేఖతో జనసేన పార్టీ కార్యకర్తలలో కాస్త ధైర్యం నింపినట్ల అయింది. అటు పవన్ కళ్యాణ్ కూడా… ఎక్కువ సీట్లు పోటీ చేసేందుకు టిడిపి తో మాట్లాడాలని కార్యకర్తలు అంటున్నారు. మొత్తం టిడిపికి సీట్లు ఇస్తే… జనసేన పార్టీ ఆ తర్వాత సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపి తో సమానంగా జనసేనకు బలం ఉందని సర్వేలు కూడా చెబుతున్నాయి.

కాబట్టి జనసేన పార్టీని అణచి వేయకుండా… తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్లాలని… అలాగైతేనే వైసిపి పార్టీ విజయాన్ని అందుకోగలరని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఇలాగే గ్రూప్ తగాదాలు ఎక్కువైతే… మళ్లీ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. మరి దీనిపై చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. (TDP)

Join WhatsApp