Gudur YCP MLA Varaprasad Meets Janasena Chief Pawan Kalyan

YCP MLA Varaprasad: ఏపీలో సార్వత్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేల టిక్కెట్లు గల్లంతయ్యాయి. ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్ 58 ఎమ్మెల్యే మ‌రియు 10 ఎంపీ స్థానాల‌కు ఇంఛార్జ్‌ల‌ను మార్చేశారు. కొంద‌రికి స్థాన చలనం క‌ల్పిస్తే.. మరికొందరిని ఎంపీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా మారుస్తున్నారు. ఇంకొంద‌రు నో టికెట్ అంటూ మొండి చేయి చూపిస్తున్నారు. ఇలా సీట్లు రాని వారంతా జ‌గ‌న్ తీరుపై ర‌గిలిపోతున్నారు. త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం ప‌క్క పార్టీల వైపు చూస్తున్నారు.

Gudur YCP MLA Varaprasad Meets Janasena Chief Pawan Kalyan

దీంతో వైసీపీ నుంచి రోజురోజుకు వ‌ల‌స‌లు భారీగా పెరుగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వ‌రుస‌గా పార్టీని వీడుతూ వైసీపీ అధిష్టానానికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. తాజాగా మ‌రో సిట్టింగ్ ఎమ్మెల్యే జ‌గ‌న్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో భేటీ అయ్యారు.

Also Read: CM Revanth Reddy: కాంగ్రెస్‌లోకి నలుగురు BRS ఎమ్మెల్యేలు ?

ఇంఛార్జ్‌ల మార్పు వ్య‌వ‌హారంలో భాగంగా గూడూరు నియోజకవర్గం టికెట్‌ను మేరుగ మురళికి వైసీపీ అధిష్టానం కేటాయించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ వ‌ర‌ప్ర‌సాద్ ను ప‌క్క‌న పెట్టింది. టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో తీవ్ర అసంతృప్తికి గురైన వ‌రప్ర‌సాద్‌.. జ‌న‌సేన‌లో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నారు. బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిన వరప్రసాద్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో దాదాపు ఇర‌వై నిమిషాలు చ‌ర్చ‌లు జ‌రిపారు.(YCP MLA Varaprasad)

Gudur YCP MLA Varaprasad Meets Janasena Chief Pawan Kalyan

గతంలో ఎంపీగా కూడా పనిచేసిన అనుభ‌వం ఉండ‌టంతో.. ఈసారి తిరుపతి లోక్ సభ నుండి పోటీ చేసే ఆలోచనలో వ‌ర‌ప్ర‌సాద్ ఉన్నారు. ఇదే విష‌యాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో కూడా చ‌ర్చించారు. తిరుప‌తి ఎంపీ టికెట్ ను కోరారు. జ‌న‌సేనాని దీనిపై హామీ ఇస్తే వరప్రసాద్ కండువా మార్చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక‌పోతే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా ప‌వ‌న్ తో సమావేశమయ్యారు. అనకాపల్లి ఎంపీ టికెట్ ను ఆయ‌న ఆశిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే జనసేన అధినేత సెగ్మెంట్ల వారీగా సమీక్ష నిర్వ‌హిస్తున్నార‌ని స‌మాచారం.

Join WhatsApp