Harish Rao Sent BRS MLAs To Revanth Reddy

Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని… ఒకేసారి నలుగురు భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు. మొన్న సాయంత్రం అధిష్టానానికి చెప్పకుండా నలుగురు భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలు మెదక్ జిల్లాకు చెందినవారు.

Harish Rao Sent BRS MLAs To Revanth Reddy

మెదక్ జిల్లాకు హరీష్ రావు బాధ్యత వహిస్తున్నారు. మొదటినుంచి మెదక్ జిల్లాకు ఇలాంటి సమస్యలు వచ్చినా హరీష్ రావు… దగ్గరుండి చూసుకుంటున్నారు. తాజాగా మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో పెద్ద చర్చ మొదలైంది. ఈ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం చేశారు. అయితే ఈ ప్రచారంపై తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ కూడా పెట్టారు.

ALSO READ : Minister Roja: మంత్రి ఆర్కే రోజా సీటుకు ఎసరు పెట్టిన క్యాడర్‌ ?

నియోజకవర్గ నిధుల కోసం, ప్రోటోకాల్ సమస్య తలెత్తకుండా చూడాలని రేవంత్ రెడ్డిని కలిసామని ఆ నలుగురు ఎమ్మెల్యేలు చెప్పారు. అయితే ఈ విషయంపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత రఘునందన్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెదక్ ఎంపీ టికెట్ కోసం కేసీఆర్ కుటుంబంలో పెద్ద లొల్లి జరుగుతుందని అతను ఆరోపించారు. మెదక్ ఎంపీగా పోటీ చేయాలని కవిత… కేసీఆర్ను కోరుతూ ఉందని… అయితే దానికి హరీష్ రావు ఒప్పుకోవడం లేదని రఘునందన్ రావు ఆరోపణలు చేశారు.

అయితే కెసిఆర్ తన మాట వినడానికి… ఈ నలుగురు ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డితో… హరీష్ రావు కల్పించారని… రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా చేస్తే కెసిఆర్ భయపడి… కవితకు మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వడని… రఘునందన్ వ్యాఖ్యల సారాంశం. వాస్తవానికి గతంలో నిజామాబాద్ ఎంపీగా కవిత పనిచేశారు. 2019 ఎన్నికలలో ఓడిపోయారు.

Harish Rao Sent BRS MLAs To Revanth Reddy

దీంతో ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మరో రెండు నెలలు ఎంపీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… ఆమె నిజామాబాద్ పైన ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. కానీ రాజకీయ లబ్ధి కోసం… మెదక్ ఎంపీగా బిజెపి తరఫున సులభంగా గెలిచేందుకు రఘునందన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని భారత రాష్ట్ర సమితి నేతలు చెబుతున్నారు. కెసిఆర్ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని వారు వెల్లడిస్తున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. (Harish Rao)

Join WhatsApp