Hyderabad as a Union Territory

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మే 13వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో… ప్రచారం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన గులాబీ పార్టీ ఈసారి ఎలాగైనా గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇటు బిజెపి అలాగే కాంగ్రెస్ పార్టీలు కూడా మంచి స్థానాలు గెలిచేలా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. Hyderabad

Hyderabad as a Union Territory

ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి బిజెపి పార్టీని అలాగే కాంగ్రెస్ పార్టీని తొక్కే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజాగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ మాసంలో అంటే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని బిజెపిని టార్గెట్ చేశారు కేటీఆర్. ఇలాంటి సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశ్నించే ఎంపీలు లేకపోతే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. Hyderabad

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్.. వైసీపీలోకి వర్మ. ?

హైదరాబాదులో మనం కాపాడుకోవాలంటే కచ్చితంగా గులాబీ పార్టీకి ఓటు వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పెను ప్రకంపనాలు నెలకొన్నాయి. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ వాదులు అంటున్నారు. అయితే కేటీఆర్ అన్నట్లుగా హైదరాబాదులో కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే… తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తెలంగాణలో హైదరాబాద్ నుంచి 70 శాతం ఆదాయం వస్తుంది. ఒకవేళ కేంద్ర పాలిత ప్రాంతం హైదరాబాద్ అయితే..ఆ ఆదాయం మొత్తం కేంద్రం తీసుకువెళ్తుంది. తద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి కి ఎలాంటి అధికారాలు ఉండవు. హైదరాబాదులో స్వేచ్ఛ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. Hyderabad

మిల్ట్రీ ఫోర్స్ దిగుతుంది. మనం ఇతర రాష్ట్రాలలో బతికినట్లుగా… హైదరాబాదులో బతకాల్సి వస్తుంది. అదే హైదరాబాద్ ఎప్పటిలాగా రాజధానిగా ఉంటే… తెలంగాణకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే హైదరాబాద్ను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు… రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ అలాగే బిజెపిలను ఇబ్బంది పెడుతున్నాయి. జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా జాతీయపరంగా ఆలోచిస్తాయని.. కానీ లోకల్ పార్టీ మాత్రమే హైదరాబాద్ గురించి ఆలోచిస్తుందని ఉద్దేశంతో కేటీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేశారు. మరి దీన్ని తెలంగాణ ప్రజలు ఎలా తీసుకుంటారో చూడాలి. Hyderabad

Join WhatsApp