India Today Survey On Ap Elections

India Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. అతి త్వరలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. మార్చి 15వ తేదీ తర్వాత ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. ఏ ఒక్క ఛాన్స్ వదులుకోకుండా ప్రచారాన్ని జనాల మధ్యలోకి తీసుకుపోతున్నారు.

India Today Survey On Ap Elections

ఈ నేపథ్యంలోనే ఏపీ అసెంబ్లీ అలాగే పార్లమెంటు సీట్ల పై ఒక్కో సర్వే తమ రిపోర్టులను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని సర్వే సంస్థలు వైసిపి పార్టీ మరోసారి ఏపీలో అధికారంలోకి వస్తుందని చెప్పాయి. అడపదడప సర్వే సంస్థలు తప్ప మిగతా అన్ని సర్వే సంస్థలు వైసీపీకే మొగ్గు చూపాయి. అయితే ఎన్నికల్లో మాత్రం వైసిపి పార్టీకి ఎదురుగాలి వీస్తుందని తాజాగా మరో సర్వే తేల్చి చెప్పింది. ఏపీ పార్లమెంట్ ఎన్నికలపై ఇండియా టుడే సి ఓటర్ సర్వే ఫలితాలను విడుదల చేసింది.

Also Read: Kcr: NDA లోకి కేసీఆర్…కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు చాణక్య వ్యూహం ?

ఇందులో వైసీపీ పార్టీకి 8 స్థానాలు మాత్రమే వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. అటు తెలుగుదేశం పార్టీకి ఏకంగా 17 స్థానాలు వస్తాయని ఇండియా టుడే సర్వే స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఏకంగా 17 స్థానాలు టిడిపి పార్టీ వశం కానున్నాయి. ప్రస్తుతానికి వైసీపీ పార్టీ 22 ఎంపీలతో చాలా బలంగా ఉంది. 2019 ఎన్నికల్లో వైసిపి పార్టీ ఏకంగా 22 ఎంపీ స్థానాలు గెలుచుకుంది.

మారిన రోజులు అలాగే వైసిపి పాలన కారణంగా ఇప్పుడు 14 స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఇండియా టుడే స్పష్టం చేసింది. అటు మూడు స్థానాలు ఉన్న తెలుగుదేశం పార్టీ ఏకంగా 14 స్థానాలను ఎక్కువగా గెలుచుకోబోతున్నట్లు ఈ సర్వే స్పష్టం చేసింది. ఇక ఓటింగ్ శాతం పరిశీలిస్తే… వైసిపి పార్టీకి 41% ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సర్వే వెల్లడించింది. అటు తెలుగుదేశం పార్టీకి 45% ఓటింగ్ శాతం వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సర్వే ప్రకటించింది.

Join WhatsApp