Kavitha Arrest

Kavitha Arrest: కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత నిన్న అనగా మార్చి 15 సాయంత్రం 5:20 నిముషాలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయింది.. 12 మంది ఈడి అధికారులు మధ్యాహ్నమే కవిత ఇంటికి చేరి సోదాలు నిర్వహించారు. కేవలం కవితకి సంబంధించినవి మాత్రమే కాకుండా ఆయన భర్త అనిల్ కు సంబంధించిన వ్యాపారాలను కూడా ఆరా తీశారు. అయితే లోక్ సభ ఎన్నికలు రాబోతున్న వేళ కవిత అరెస్టు బిఆర్ఎస్ కి మంచి సెంటిమెంట్ అస్త్రంగా పనిచేయబోతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Kavitha Arrest

ఎందుకంటే ఏదైనా రాజకీయ పార్టీలో ఆ పార్టీ తరఫున వాళ్లు జైలుకు వెళ్తే కచ్చితంగా వారు చేసిన చెడు అటు ఉంచితే వారిపై సింపతి పెరిగి వారికే ఈ ప్రజలు ఓట్లు వేస్తారు.అలా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి కవిత అరెస్టు కలిసి రాబోతుందని చాలామంది భావిస్తున్నారు.అంతేకాదు కాంగ్రెస్ వాళ్ళు అయితే బీఆర్ఎస్ పార్టీ మీద సింపతి క్రియేట్ చేసి వారికి లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ రావడం కోసమే లోక్ సభ ఎన్నికలకు ముందే కవితను అరెస్టు చేయించారని, ఇదంతా బిజెపి, బీఆర్ఎస్ కలిసి చేస్తున్న ప్లాన్ లో భాగమే అంటూ ఆరోపిస్తున్నారు.(Kavitha Arrest)

Also Read: Kavitha: ఎమ్మెల్సీ కవిత పై బీజేపీ నేతల రియాక్షన్ ఇది..!

ఇక అందరూ అనుకుంటున్నట్లే కవిత అరెస్టు కేసీఆర్ కి కలిసి రాబోతుంది.నిజంగానే దీన్ని సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకొని కేసీఆర్ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతారు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ కి కవిత అరెస్టు మంచి సింపతి డ్రామా క్రియేట్ చేసే విధంగా కరెక్ట్ టైంలో ఆమెను అరెస్టు చేశారని, ఇదంతా కేసిఆర్ కి కలిసి వచ్చేలా ఉందని పలువురు భావిస్తున్నారు.

Kavitha Arrest

అయితే ఈ విషయంలో బిజెపి మాత్రం తప్పు చేసిన వారిని ఎవరినైనా సరే వదిలిపెట్టం అని నిరూపించుకోవడానికి అరెస్టు చేశామని అంటుంటే, కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్, బిజెపి పార్టీ ఒక్కటేనని, సింపతి డ్రామా క్రియేట్ చేయడం కోసమే ఇలా ఎన్నికల ముందు ఆమెను అరెస్టు చేశారని భావిస్తున్నారు. ఇక ఈ విషయంలో అటు సింపతితో బీఆర్ఎస్ కి ఓట్లు పడితే,ఇటు చెప్పిన పని చేశారని బిజెపి కి కూడా ఓట్లు పడతాయని ఇరు పార్టీలు ఒక వ్యూహం ప్రకారమే కవితను అరెస్టు చేశారని కాంగ్రెస్ వాళ్లు ఆరోపిస్తున్నారు. మరి చూడాలి కవిత జైలుకు వెళ్తుందా లేక మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుందా అనేది.(Kavitha Arrest)

Join WhatsApp