thatikonda rajaiah is the warangal brs mp candidate

Kcr: తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. మే 13వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఈ తరుణంలో… అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులను కూడా అన్ని పార్టీలు ప్రకటించాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… ఎలాగైనా తెలంగాణలో 10 ఎంపీ సీట్లు కాని గెలవాలని ప్లాన్ వేస్తోంది.Kcr

KCR Big Sketch Former Minister as Warangal BRS MP candidate

బిజెపి పార్టీ కూడా… గతంలో కంటే మెరుగైన ఎంపీ సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తోంది. ఇక ముఖ్యంగా గులాబీ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని… కవర్ చేయడానికి ఈ పార్లమెంట్ ఎన్నికల ను ఎంచుకుంది. ఎలాగైనా ఏడు నుంచి 8 ఎంపీ సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తోంది. ఇలాంటి నేపథ్యంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయం కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కాస్త ఇబ్బందిగా మారింది.Kcr

Also Read: Ponguleti Srinivas: కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు పొంగులేటి స్కెచ్‌…?

అయితే ఇలాంటి నేపథ్యంలోనే.. కాంగ్రెస్ మరియు భారత జనతా పార్టీని ఓడించేందుకు సీనియర్ లీడర్ తాటికొండ రాజయ్యను ఫిక్స్ చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన తాటికొండ రాజయ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చారు గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు. దళిత నాయకుడు కావడంతో… తాటికొండ రాజయ్యకు ఆ టికెట్ దక్కింది.Kcr

అంతేకాకుండా కడియం కావ్య పై గుంటూరు ముద్ర పడింది. ఏపీకి చెందిన కడియం కావ్య కు ఎలా తెలంగాణ ప్రజలు ఓటు వేస్తారని ఇప్పుడు చర్చ జరుగుతోంది. అటు బిజెపి అభ్యర్థి అయిన ఆరురి రమేష్.. వందల సంఖ్యలో భూములను కబ్జా చేశాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే ఆరూరి రమేష్ పెద్దగా జనాల్లో పరిచయం లేని పేరు. ఈ లెక్కన చూస్తే తాటికొండ రాజయ్య బలమైన అభ్యర్థిగా వరంగల్లో ఉన్నారు. అందుకే కల్వకుంట్ల చంద్రశేఖర రావు… తాటికొండ రాజయ్య ను నమ్మారు. Kcr

Join WhatsApp