KCR campaign for CM Jagan in AP chandrababu

KCR: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అయినా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికల హడావిడి ఉంది. తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో… ఏపీలో మాత్రం పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ తరుణంలో సీఎం జగన్మోహన్ రెడ్డినీ ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యాయి. KCR

KCR campaign for CM Jagan in AP chandrababu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బిజెపి, జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు గ్రౌండ్ స్థాయిలో కూటమిలా ఏర్పడి జగన్ మోహన్ రెడ్డిని ఓడించేందుకు కంకణం కట్టుకున్నాయి. అయితే ఈ మూడు పార్టీలను భూస్థాపితం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సింహంల ముందుకు వెళుతున్నారు. అయితే ఏపీ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్న నేపథ్యంలో… తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బాంబు పేల్చారు. KCR

Also Read: CM Jagan: 41 శాతం పెరిగిన సీఎం జగన్‌ ఆస్తులు.. దేశంలోనే నెంబర్ వన్.. మొత్తం ఎన్ని వందల కోట్లో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆయన వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు… ఏపీలో వచ్చేది వైసిపి ప్రభుత్వం అని కుండబద్దలు కొట్టి చెప్పారు. కానీ కానీ ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది మాత్రం చెప్పనని ఆయన వెల్లడించారు. అయితే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా కెసిఆర్ ఈ ప్రకటన చేశారని తెలుస్తోంది. KCR

అంతేకాదు తెలంగాణలో గులాబీ పార్టీ ఓటమికి చంద్రబాబు మరియు బిజెపి పార్టీలు అని కేసీఆర్ తన ఆలోచనలో పెట్టుకున్నారట. అయితే ఆ రెండు పార్టీలను ఓడించేందుకు ఏపీకి వెళ్లి జగన్ మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేయాలని కూడా అనుకుంటున్నారట. షెడ్యూల్ కూడా ఖరారు చేసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారట. ఒకవేళ కేసీఆర్ ప్రచారం చేస్తే… జగన్మోహన్ రెడ్డికి బాగా ప్లస్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. KCR

Join WhatsApp