KCR is going to jail

KCR: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు పర్యాయాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన నాయకుడిగా కేసీఆర్,టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఓట్లు వేశారు.కానీ ఈ పదేళ్లలో టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారి భారత రాష్ట్ర సమితిగా ఏర్పడింది. అయితే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడుతుందని గులాబీ పార్టీ వాళ్లు అనుకున్నారు. కానీ అందరూ అనుకున్న దానికి భిన్నంగా ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దానికి ప్రధాన కారణం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన కొన్ని కార్యక్రమాలలే అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ చేయబోయే పనుల గురించి,గ్యారెంటీ ల గురించి చెప్పడం అలాగే తెలంగాణ ప్రజలు కూడా పదేళ్లు బీఆర్ఎస్ పరిపాలన చూసాం..

KCR is Going to Jail

ఒకసారి కాంగ్రెస్ కి కూడా అవకాశం ఇస్తే వాళ్ళ పనితీరు ఎలా ఉందో చూద్దాం అని ఆలోచించారు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఒక పార్టీ అధికారంలో ఉంటే మరో పార్టీ నాయకులు జైలుకు వెళ్లడం రాజకీయాల్లో సర్వసాధారణం. ఇప్పటికే ఆంధ్రాలో వైసీపీ అధికారంలో ఉంటే చంద్రబాబు, టిడిపి అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కొన్ని కేసులు పెట్టి రేవంత్ రెడ్డిని జైలు పాలు చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఆ సమయంలో రేవంత్ రెడ్డి నేను కచ్చితంగా కేసీఆర్ ను జైలుపాలు చేస్తాను అంటూ ఎన్నో శపదాలు చేశారు. అయితే తాజాగా రేవంత్ రెడ్డి తన మాట నిలబెట్టుకోబోతున్నట్టు కొన్ని వార్తలు మీడియా లోవినిపిస్తున్నాయి.

Also Read: Niharika: ఆ ఒక్క మాటతో పవన్ పరువుని గంగలో కలిపేసిన నిహారిక..!

దానికి ప్రధాన కారణం తాజాగా హైదరాబాద్ లోని కోకాపేటలో 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం అతి తక్కువ ధరకు కొని బీఆర్ఎస్ భవనానికి కేటాయించిన సంగతి మనకు తెలిసిందే.అయితే అక్కడ భూమి ఎకరానికి 50 కోట్లు ఉంటే కేవలం 3.41 కే కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసింది.దీంతో ఈ విషయంపై హైకోర్టులో కేసీఆర్ కేసు నమోదు అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 11 ఎకరాల భూమిని తక్కువ ధరకే కొనుగోలు చేసి బీఆర్ఎస్ భవనానికి కేటాయించడం వల్ల తెలంగాణ ప్రభుత్వం దాదాపు 1100 కోట్లు నష్టపోయిందని తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసి వారిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు బీఆర్ఎస్ భవనానికి కేటాయించిన భూమిని రద్దుచేసి వాళ్లపై న్యాయపరంగా కేసు నమోదు చేయాలని ఏసీబీ వారికి ఆదేశాలు జారీ చేశారు హైకోర్టు. ఇక ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న వారిలో కేసీఆర్ కూడా ఉన్నారు.

KCR is going to jail

అంతేకాకుండా రెవెన్యూ సంబంధిత అధికారులపై కూడా వేటు పడింది.అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా కేసీఆర్ పై గతంలో తాను చేసిన శపధం నెరవేరేబోతుందని కొంతమంది కాంగ్రెస్ అభిమానులు ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో కేసీఆర్ జైలుకు వెళ్తారని కొంతమంది భావిస్తున్నారు. అయితే తాజాగా బీఆర్ఎస్ కార్యకర్తలు పులి బయటకు వస్తుంది అంటూ ప్రచారం చేస్తూ ఉంటే వీరి ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా రేవంత్ రెడ్డి పులి బయటకి వస్తే బోను రెడీగా ఉంది అంటూ కౌంటర్ వేయడం ప్రస్తుతం రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు కేసీఆర్ జైలుకు వెళ్తే రేవంత్ రెడ్డి ఆయనపై నెగ్గినట్లే అని కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి కేసీఆర్ జైలుకు వెళ్తారా లేదా అనేది. (KCR)

Join WhatsApp