KCR: Phone Tapping Case

KCR: రాజకీయాలు అంటేనే సముద్రంలో అలల లాంటివి. అవి పడుతూ లేస్తూ ఉన్నట్టు రాజకీయ పార్టీలు కూడా ఓసారి అధికారం ఉంటే మరోసారి అధికారాన్ని కోల్పోతూ ఉంటాయి. ఆ విధంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు గద్దెనెక్కింది. మూడోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గత రెండు పర్యాయాలు కేసీఆర్ మాత్రమే సీఎంగా వ్యవహరించారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ఎప్పుడైతే అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ వివాదంలో ముగ్గురు ప్రధాన పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు.

KCR: Phone Tapping Case

ఈ వివాదంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. దీని గురించి కూడా రాజకీయ నాయకులు ఎక్కడా కూడా మాట్లాడడం లేదు. పోలీసులు కూడా ఎలాంటి వివరాలు బయట పెట్టడం లేదు. అంటే పూర్తి వివరాలు లాగడం కోసం, ఆ పని సైలెంట్ గా చేసుకుపోతున్నట్టు సమాచారం. పూర్తిస్థాయిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి కూపి లాగిన తర్వాతే బయట పెడతారన్నట్టు సమాచారం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. ఈ తరుణంలో ప్రణీత్రావును అడ్డంగా పెట్టుకొని కెసిఆర్ ఇదంతా నడిపించారా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. (KCR)

Also Read: Congress: కాంగ్రెస్ లో అంతర్యుద్ధం.. తుమ్మలకు సిగ్గు, శరం లేదట.. కోమటిరెడ్డి సంచలనం ?

అంతేకాకుండా ప్రణీత్ రావు అరెస్ట్ చేసి విచారణ మొదలుపెట్టిన పోలీసులు మరో ఇద్దరు ఏఎస్పీలు భుజంగారావు, తిరుపతన్నలను కూడా అరెస్టు చేశారు. అంతేకాకుండా వీరిద్దరు దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఎన్నికల్లో వారి సొంత వాహనాల్లోనే డబ్బులు కూడా తరలించినట్లు తెలుసుకున్నారు. అంతేకాకుండా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా మరో ముగ్గురు అధికారులపై లుక్ అవుట్ నోటీసులు కూడా పంపారు. ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగానే ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధా కిషన్, న్యూస్ మీడియా నిర్వాహకుడు శ్రావణరావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ దేశాన్ని విడిచి వెళ్లినట్లు తెలుస్తోంది.

KCR: Phone Tapping Case

ఈ తరుణంలో లుకౌట్ నోటీసులు పంపి అంతర్జాతీయంగా అన్ని విమానాశ్రయాలను అలర్ట్ చేశారు. అయితే టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రణీత్ రావు, రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోనే ఉంటూ రేవంత్ రెడ్డి మరియు ఆయన తమ్ముళ్ల ఫోన్స్ ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. ట్యాపింగ్ వ్యవహారమంతా ఎస్ఐబి మాజీ చీఫ్ ఆదేశాల మేరికే చేసినట్టు విచారణలో చెప్పారు. అయితే ప్రభాకర్ రావు కూడా పోలీసులకు చిక్కితే మాత్రం ట్యాపింగ్ వ్యవహారం వెనుక ఎవరున్నారనేది బిజీగా అర్థమవుతుంది. అయితే ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం ఇదంతా కేసిఆర్ కనుసన్నాలోనే జరిగినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ పారిపోయిన వ్యక్తులంతా దొరికితే ఈ కేస్ అంతా కేసీఆర్ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని పలు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.(KCR)

Join WhatsApp