KCR playing a game with Kadiam Srihari life

KCR: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మే 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అందు పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. ముఖ్యంగా గులాబీ పార్టీ మాత్రం పార్లమెంట్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన బాధ నుంచి బయటకు రావాలంటే గులాబీ పార్టీ ఇప్పుడు కచ్చితంగా గెలవాలి.KCR

KCR playing a game with Kadiam Srihari life

దానికి తగ్గట్టుగానే గులాబీ పార్టీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎవరు ఊహించని రీతిలో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో… పోరాటం చేసిన కేసీఆర్… ఇప్పుడు మళ్లీ అదే ఊపుతో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరి ఎపిసోడ్ గుర్తుచేస్తూ సెంటిమెంట్ ను రగులుచుతున్నారు కేసీఆర్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు కడియం శ్రీహరి. KCR

అంతేకాదు పది కోట్లు కూడా కేసీఆర్ దగ్గర తీసుకొని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారట కడియం శ్రీహరి. అయితే.. కడియం శ్రీహరి విషయంలో కెసిఆర్ అంటే పడని వారు కూడా… కెసిఆర్ కు సపోర్ట్ చేస్తున్నారు. అన్ని ఇచ్చిన కేసీఆర్ను కాదని రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లిన కడియం శ్రీహరి పై ఫైర్ అవుతున్నారు తెలంగాణలోని ప్రతి ఒక్క ఓటరు అలాగే లీడర్. అయితే ఇదే అంశాన్ని పదేపదే కేసీఆర్ కూడా తెరపైకి తీసుకువస్తున్నారు. KCR

Also Read: Hyderabad: కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్..?

ఇంకా లేటెస్ట్ గా వరంగల్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. గులాబీ పార్టీకి అన్యాయం చేసి తన రాజకీయ జీవితం నాశనం చేసుకున్నాడని కడియం శ్రీహరి పైరయ్యారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కడియం శ్రీహరి పై వేటు పడక తప్పదన్నారు. మరో మూడు నెలల్లోనే కడియం శ్రీహరి పదవి పోతుందని… స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్య విజయం సాధిస్తారని ప్రకటించారు కేసీఆర్. దీంతో కడియం శ్రీహరి క్యాడర్లో కాస్త అసంతృప్తి నెలకొంది. కెసిఆర్ చెప్పాడంటే కచ్చితంగా జరుగుతుందని తెలంగాణలో ఒక నమ్మకం ఉంది. KCR

ఎప్పుడు కడియం శ్రీహరి విషయంలో కూడా గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు చాలా సీరియస్ గా ఉన్నారు. అతనిపై వేటు వేసేవరకు తగ్గేదే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఊపు చూస్తుంటే కడియం శ్రీహరి పై వేటు పడక తప్పదని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి కడియం శ్రీహరి పై ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి.KCR

Join WhatsApp