Khammam Lok Sabha politics that has become crucial

Khammam Mp Seat: తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే దానికి ప్రధాన కారణం ఖమ్మం, నల్గొండ జిల్లాలే.. తెలంగాణలో ఉన్న రాజకీయాన్ని ఈ రెండు జిల్లాలే అతలాకుతనం చేసేసాయి. అప్పటివరకు మేమే గెలుస్తాం అని ధీమాతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరోసారి హ్యాట్రిక్ కొడుతుందని అందరూ అనుకున్నారు. కానీ వీరి ఆశలు అడియాశలు అయ్యాయి. తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించింది ఖమ్మం నల్గొండ జిల్లాలే.ఈ జిల్లాల నుండే కీలక నాయకులు ఉన్నారు. అలాగే ఈ రెండు జిల్లాల కారణంగా కాంగ్రెస్ అధికారంలో రావడంతో ఇక్కడి నాయకులను మంత్రులుగా కూడా చేసింది కాంగ్రెస్ అధిష్టానం.

Khammam Lokh Sabha politics that has become crucial

అయితే అలాంటి ఖమ్మం జిల్లాలో లోక్ సభ రాజకీయం చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇక్కడ ఎంపీ సీట్ కోసం దాదాపు అయిదారుగురు పోటీ పడుతున్నారు. ఇందులో సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి తో పాటు తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ తో పాటు ప్రస్తుత తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా తాజాగా ఎంపీ సీట్ కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. దీంతో ఇక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఎంపీ సీట్ కట్టబెట్టాలో తెలియక అయోమయంలో పడినట్టు సమాచారం.(Khammam Mp Seat)

Also Read: KCR: బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ పిలుపు.. గట్టిగా కొట్టాలంటూ..!

అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అన్నకే ఎంపీ సీట్ ఇవ్వాలని కోరుతున్నారట. ఎందుకంటే ఖమ్మంలో కాంగ్రెస్ గెలవడానికి ప్రధాన కారణం పొంగులేటి సోదరులే.. శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఆయన సోదరుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేసి ఎంపి సీట్ కోసం ఆశిస్తున్నారు. అలాగే తుమ్మల నాగేశ్వరరావు కూడా తనకి ఇవే చివరి ఎన్నికలు అని చెబుతున్నారు. అంతేకాకుండా తన కొడుకుని రాజకీయ రంగ ప్రవేశం చేయించాలనే ఆలోచనలో పడ్డారు.అందుకోసమే తన కొడుకు యుగేందర్ ని ఎంపీ చేయాలి అని ఆరాటపడుతున్నారు. అలాగే సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి కూడా ఖమ్మం ఎంపీ సీటు నాదే అని పదేపదే మీడియాకు చెబుతున్నారు.

Khammam Lok Sabha politics that has become crucial

ఇక వీరందరూ చాలాదన్నట్లు ఈమధ్యనే బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ కూడా ఖమ్మం ఎంపీ సీట్ కోసం పోటీ పడుతున్నారు.అలాగే డిప్యూటీ సీఎం సతీమణి ఖమ్మం ఎంపీ సీట్ కోసం దరఖాస్తు చేసుకుంది.దీంతో ఖమ్మం ఎంపీ సీటు ఎవరికి ఇవ్వాలో తెలియక కాంగ్రెస్ అధిష్టానం తలలు పట్టుకుంటుంది. అంతేకాదు ఒకరికి ఎంపీ సీట్ ఇస్తే మరొకరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలియని అయోమయంలో పడిపోయింది కాంగ్రెస్ అధిష్టానం. మరి ఈ చిక్కులన్నీ దాటుకొని కాంగ్రెస్ అధిష్టానం ఖమ్మం ఎంపీ సీటునుచివరికి ఏ నాయకుడికి కట్టబెడుతుందో చూడాలి.(Khammam Mp Seat)

Join WhatsApp