komatireddy rajagopal Comments on thummala

Congress: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ హాట్ టాపిక్గా మారిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అతి తక్కువ సీట్లతో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్ కు నాలుగు సీట్లు ఎక్కువ గెలుచుకొని అధికారాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే ముఖ్యంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. Congress

komatireddy rajagopal Comments on thummala

అయితే ఆ 6 గ్యారంటీలను అమలు చేసేందుకు నానా కష్టాలు పడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటివరకు అయితే ఫ్రీ బస్సు కార్యక్రమాన్ని మాత్రం అద్భుతంగా నడిపిస్తోంది. ఇక మిగతా అన్ని గ్యారెంటీలలో ఏ ఒక్కటి సరిగా పనిచేయడం లేదు. ఇంతలోనే కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. ఏ క్షణమైనా రేవంత్ రెడ్డి సీటు పోవడం ఖాయం అని తెలుస్తోంది. దీనికి ముఖ్య కారణం బట్టి విక్రమార్క అని తెలుస్తోంది. మొన్న యాదాద్రి టూర్ లో చిన్న పీట వేసి భట్టి విక్రమార్కను దారుణంగా అవమానించారు రెడ్డి మంత్రులు. Congress

Also Read: Taslima Mohammed: ఆదివారం కూలీగా బిల్డప్.. ఏసీబీకి చిక్కిన సీతక్క దోస్త్‌ ?

ఇక తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పరువు తీశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ ద్రోహి అంటూ తుమ్మల నాగేశ్వరరావు ను టార్గెట్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వడానికి సిగ్గు, శరం ఉందా ? అంటూ తుమ్మల నాగేశ్వరరావుపై ఆరోపణలు చేసారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తుమ్మల ఉద్యమకారుడు కాదు అలాంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవి ఎలా ఇచ్చారు? అని నిప్పులు చెరిగారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే గులాబీ ప్రభుత్వంలో తుమ్మల మంత్రి పదవికి అనర్హుడని చెప్పకనే చెప్పిన రాజగోపాల్ రెడ్డి… ఇప్పటి ప్రభుత్వంలో కూడా అతడు అనర్హుడని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశాడు.Congress

అంటే తుమ్మల స్థానంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలనే ఉద్దేశంలో రాజగోపాల్ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తాజాగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైందని స్పష్టం చేస్తున్నాయి. అటు మొన్న సీఎం రేవంత్ రెడ్డిని గట్టిగానే అరుసుకున్నారు తుమ్మల నాగేశ్వరరావు. మొన్న కారు దిగి మరి రేవంత్ రెడ్డికి చురకాల అంటించారు తుమ్మల. అయితే ఆ ఎపిసోడ్ నేపథ్యంలో తుమ్మలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో రేవంత్ రెడ్డి తిట్టించారని కొంతమంది చెబుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో తుమ్మలను బయటకు పంపించే కుట్రలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. Congress

Join WhatsApp