Konda Surekha for AP in support of Sharmila

Konda Surekha: ఏపీ రాజకీయాల్లో రోజుకొక కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఏపీ లో ఇప్పటికే ఒకే పార్టీ నుండి ఇద్దరు కీలక నాయకులు చెరొక పార్టీలో కీలక బాధ్యతలు తీసుకున్నారు. అలా వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసులు ఇద్దరు వేరుపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ జైలు పాలయితే ముందుండి పార్టీని నడిపించింది షర్మిల.కానీ షర్మిలను లెక్కచేయకుండా జగన్ ఆమెని పక్కన పెట్టడంతో ఆమె ఒంటరిదయిపోయింది. ఇక తెలంగాణలో పార్టీ పెట్టి ఎన్నికల బరిలో నిలుస్తాను అని చెప్పినప్పటికీ అది సాధ్యం కాలేదు. దాంతో తెలంగాణను వదిలేసి మళ్లీ ఆంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పడానికి షర్మిలా రెడీ అయిపోయింది.

Konda Surekha for AP in support of Sharmila

ఇక షర్మిల తన తండ్రి పార్టీ కాకుండా అన్న నుండి వేరుపడి కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించింది. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో టిడిపి,జనసేన జగన్మోహన్ రెడ్డి పై చేసే వ్యాఖ్యలు ఒకెత్తయితే సొంత చెల్లె విమర్శలు ఒకెత్తవుతున్నాయి. ఈమె జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ మా కుటుంబాన్ని చీల్చిందే జగన్మోహన్ రెడ్డి అంటూ మాట్లాడింది. (Konda Surekha)

Also Read: Revanth Reddy: రేవంత్ ఆటలో కోదండరాం బలి అయ్యాడా.. ముందే తెలిసి ఇలా చేశాడా ?

ఇక ఇదంతా పక్కన పెడితే షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నది కాబట్టి ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ నుండి కూడా సపోర్ట్ ఉంటుంది. ఇక త్వరలోనే ఏపీ రాజకీయాల్లో షర్మిలకు మద్దతుగా కొండా సురేఖ వచ్చి ఆంధ్రప్రదేశ్లో షర్మిల తరఫున ప్రచారం చేయబోతుంది అని వార్తలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే కొండ సురేఖ రాక ఏపీ కాంగ్రెస్ కి ప్లస్సా.. మైనస్సా..అని పలువురు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా చెప్పుకుంటే రేవంత్ రెడ్డి ని చంద్రబాబు నమ్మినబంటు అని ఎన్నో వార్తలు వినిపించిన సంగతి మనకు తెలిసిందే. అయితే తెలంగాణ నుండి ఎంతమంది కీలక నాయకులు వచ్చినా కూడా మాకు ఏం కాదు అని వైసిపి అధిష్టానం భావిస్తుందట.

Konda Surekha for AP in support of Sharmila

ఎందుకంటే తెలంగాణ నుండి వచ్చిన కీలక నాయకుల వల్ల తమపై ఏపీ ప్రజల్లో సింపతి పెరుగుతుందని, ఫలితంగా ఓట్లు కూడా మాకే పడతాయి అని ధీమా వ్యక్తం చేస్తున్నారట.ప్రజలు కూడా ఈ విషయంలో చర్చించుకుంటారని, కాంగ్రెస్ కి ఓటు వేసిన టిడిపి, జనసేన ఎవరికి ఓటు వేసినా మొత్తం ఒకటే అని ప్రజలు నమ్ముతారు. ఫలితంగా ఎన్నికల్లో ఓట్లు తమకే పడతాయి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తెలంగాణ నుండి కీలక నాయకులు ఆంధ్రాలోకి వస్తే అది కాంగ్రెస్ కే మైనస్ కానీ తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తమకే సింపతి కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. మరి వైసిపి నాయకులు అనుకున్నట్లే ఆంధ్రా కి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రావడం వల్ల వారికి లబ్ది చేకూరుతుందా లేదా అనేది చూడాలి.(Konda Surekha)

Join WhatsApp