KTR arrested in that case

KTR: బీఆర్ఎస్ కీలక నాయకుల్లో కేటీఆర్ ఒకరు.. ఈయన ఈసారి గనుక తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సీఎం అయ్యేవారు. కానీ దురదృష్టవశాత్తు ఆయనకు ఆ అవకాశం లేకుండా పోయింది. ఇక కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నో విషయాలు తెరమీదకి తీసుకొస్తూ బీఆర్ఎస్ నాయకుల ఒక్కొక్కరి చిట్టాలు విప్పుతున్నారు.అయితే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్స్ స్కాం కేసులో కవిత అరెస్టై జైల్లో కూర్చుంది.కనీసం ఈమెకు బెయిల్ ఇవ్వడానికి కూడా ఈడి ఒప్పుకోవడం లేదు.

KTR arrested in that case

అయితే తాజాగా చెల్లెలు దారిలోనే అన్న కేటీఆర్ కూడా జైలు బాట పట్టక తప్పదు అని వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు. ఈయన రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేటీఆర్ కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా జైలుకి వెళతారు. ఈయన ఆ కేసులో అరెస్ట్ అవ్వడం ఖాయం అంటూ సంచలన కామెంట్స్ చేశారు.కానీ ఏ కేసులో అరెస్ట్ అవుతారు అనేది మాత్రం బయట పెట్టలేదు.(KTR)

Also Read: Kcr: కేసీఆర్ బిగ్ స్కెచ్…వరంగల్ BRS ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి..!

అయితే వేణు స్వామి ఈ కామెంట్స్ చేసినప్పటి నుండి చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు అయోమయంలో పడిపోయారు. ఇప్పటికే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతోంది.ఇలాంటి సమయంలో కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతే బీఆర్ఎస్ ని పట్టించుకునే వారు ఎవరు ఉంటారు.బిజెపి, కాంగ్రెస్ పార్టీలోకి మరిన్ని వలసలు పెరుగుతాయి.బీఆర్ఎస్ లో ఉన్న నాయకులను అడ్డుకునే వారు ఎవరు ఉండరు అని భయపడిపోతున్నారు.

 KTR arrested in that case

ఇక మరి కొంతమందేమో కేటీఆర్ కూడా జైలు పాలైతే చివరికి బీఆర్ఎస్ కి హరీష్ రావే దిక్కు అవుతారని, హరీష్ రావు కనుక ఒక అడుగు ముందుకు వేస్తే బీఆర్ఎస్ నుండి నెక్స్ట్ సీఎం అభ్యర్థి అవుతారని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పటివరకు బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్,కవిత వంటి కీలక నాయకుల పై ఆరోపణలు ఉన్నాయి. కానీ హరీష్ రావు పై ఎలాంటి ఆరోపణలు లేవు. దీంతో బీఆర్ఎస్ కి హరీష్ రావే పెద్దదిక్కు అని చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు నమ్ముతున్నారు.(KTR)

Join WhatsApp