Is KTR the reason for the downfall of BRS party

KTR : కాంగ్రెస్ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో ఎవరైనా లబ్ది పొందారా అని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ రుణమాఫీ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. అలానే కేటీఆర్ మాట్లాడుతూ 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు రైతులకు రైతుబంధు రావడంలేదని కేటీఆర్ అన్నారు. దేవుళ్ళు మీద ఒట్టు వేసి ఓటర్లని మభ్యపెడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యనించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే బిజెపి కాంగ్రెస్ కి భయం ఉంటుందని చెప్పారు.

KTR comments on BJP

చేవెళ్ల అలంపూర్లో బీఆర్ఎస్ గెలుస్తోందని అలానే ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పది సీట్లు వస్తే కేసీఆర్ దేశ రాజకీయాలని ప్రభావితం చేస్తామన్నారు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేటీఆర్ మాట్లాడుతూ కడియం శ్రీహరి 2013లో పార్టీలో చేరాడు. పదేళ్లలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఉపముఖ్యమంత్రి పదవులను అనుభవించారని కడియం శ్రీహరి ఆరూరి రమేష్ నమ్మించి గొంతు కోశారని అన్నారు. ప్రజలు అందుకే ఆగ్రహంతో ఉన్నారన్నారు.

Also read: Umidigi A15 ultra A16 Pro: న్యూ ఫోన్స్, టాబ్లెట్స్.. ఫీచర్స్ ఇవే.!

కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఏర్పడ్డాయని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నారన్నారు. వరంగల్లో కాంగ్రెస్ మూడవ స్థానంలో ఉంటుంది దేశ పాలనలో అన్ని నిత్యవసర సరుకుల ధరలు పెరిగిపోయాయి. ఆదానీ, అంబానీలు 14 లక్షల కోట్లు మాఫీ చేశాడు. శ్రీరాముడు అందరివాడు దేవుని అడుగు దేవుడిని అడ్డుపెట్టుకుని కేసీఆర్ రాజకీయం చేయలేదు అని అన్నారు. అలానే కేటీఆర్ మాట్లాడుతూ 10, 12 సీట్లు వస్తే దేశ రాజకీయాల్లో మార్పు వస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే పోలీసులు అధికారులు భయపడతారు అని కేటీఆర్ అన్నారు. అలానే కేటీఆర్ మాట్లాడుతూ 2014లో 2018లో బీజేపీ గాలి వున్నా బీఆర్ఎస్ అడ్డుకుంది అని కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి (KTR).

Is KTR the reason for the downfall of BRS party
Join WhatsApp