Latest AP Survey Predicts Jagan's Victory Again

AP Survey: ఆంధ్రప్రదేశ్లోని ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్ది పలు జాతీయ సర్వే సంస్థలు కూడా అన్ని పలు రకాల సర్వేలను విడుదల చేస్తూ ఉన్నాయి. ఇందులో ఎక్కువ శాతం ఏపీ సీఎం జగన్ గెలుస్తారని చెబుతున్నాయి.. టైమ్స్ నౌ నుంచి మొదలుపెడితే పలు రకాల జాతీయ సర్వే సంస్థలు కూడా జగన్ కి ఎక్కువగా మెజారిటీ సీట్లు వస్తాయనే విధంగా తెలుపుతున్నారు.. అయితే ఇప్పుడు తాజాగా క్షేత్రస్థాయిలో మాత్రం జగన్కు అంత అనుకూల వాతావరణం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Latest AP Survey Predicts Jagan’s Victory Again

అయితే కొన్ని జాతీయ సంస్థలు సైతం టిడిపి- జనసేన కలిస్తే ఆ పార్టీలదే హవా అంటూ కూడా తెలుపుతున్నారు. అయితే ఇటీవల జన్మత్ పోల్ సర్వే.. ఒక సర్వే ఏజెన్సీని రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మనోభావాలను తెలుసుకొని రాజకీయపరంగా వారు ఏ వైపుగా ఉన్నారనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీ కచ్చితంగా..116 నుంచి 118 స్థానాలను సైతం గెలుచుకుంటుందని ప్రకటించారు. అయితే టిడిపి- జనసేన మాత్రం 46 నుంచి 48 స్థానాలకి ఉంటుందంటు స్పష్టం చేయడం జరిగింది.

Also Read: Sania Mirza: భర్తకు విడాకులిచ్చిన సానియా భరణం కింద ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా..?

ఎన్నికల పైన ఈ సంస్థ చేపట్టిన సర్వేలలో చాలా వరకు దగ్గరగా ఫలితాలు ఉన్నాయట. గత తెలంగాణలో కాంగ్రెస్కు 63 సీట్లు లోపు వస్తాయని తెలియజేయగా బిఆర్ఎస్ కు 45 లోపు వస్తాయని తెలుపగా అందులో 39కి బిఆర్ఎస్ కు పతనమయింది. ఇప్పుడు ఏపీలో కూడా ఆ సమస్త సర్వే ఫలితాలు తెలియజేయడంతో వైసిపి నాయకులు పైన నమ్మకం కలుగుతోంది. చాలామంది టిడిపి కార్యకర్తలు నాయకులు మాత్రం దీన్ని కొట్టి పారేస్తున్నారు.

Latest AP Survey Predicts Jagan's Victory Again

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత ఉందంటూ మా పార్టీని గెలుస్తుంది అంటూ చాలా కామెంట్స్ చేస్తున్నారు.. క్షేత్రస్థాయిలోనూ జగన్ పైన వ్యతిరేకత ఉందని అందుకే అభ్యర్థులను కూడా మారుస్తున్నట్లు తెలుపుతున్నారు.. మరి సర్వేలలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తారని చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్ల పైన నిర్వహించే ఈ సర్వే ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి చూడాలి.. ఓటింగ్ శాతం విషయానికి వస్తే వైసిపికి 48 శాతం.. టిడిపి జనసేన కి 44%.. కాంగ్రెస్ ,బిజెపికి..1.5 శాతం ఇతరులకు 5 శాతం అన్నట్టుగా తెలుపుతున్నారు. (AP Survey)

Join WhatsApp