Minister Roja 40 Lakhs Robbery On Puttur Ticket

Minister Roja: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు నెలల సమయం కూడా లేదు. ఏ క్షణమైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. పార్లమెంట్ ఎన్నికల తో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏపీలో ఉన్న అన్ని పార్టీలు అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించాయి. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మంత్రి రోజాకు ఊహించని షాక్ లు తరుగుతున్నాయి.

Minister Roja 40 Lakhs Robbery On Puttur Ticket

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో… మంత్రి రోజాకు టికెట్ రాదని తాజాగా మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం నగరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా రోజా కొనసాగుతున్నారు. అయితే ఆమె గెలిచినప్పటి నుంచి వైసీపీ నేతలలో కొంతమందితో రోజా విభేదాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే ఆ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయట. రోజా సోదరుడు… నగరి నియోజకవర్గంలో అరాచకాలకు పాల్పడుతున్నాడని… అతని ప్రాధాన్యత పెరుగుతో ఉందని… ఇప్పటికే వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయట.

Also Read: YCP: సోనియ‌మ్మ పెంపుడు కూతురిగా షర్మిల….సీఎం జగన్‌ రివర్స్‌ ఎటాక్‌ ?

ఇక తాజాగా ఏపీ మంత్రి రోజా సోదరుడు పుత్తూరు వైసిపి ఇన్చార్జి కుమారస్వామి పై సంచలన ఆరోపణలు వచ్చాయి. కృపలక చైర్మన్ పదవి ఇప్పిస్తానని.. ఏకంగా 40 లక్షలు తీసుకున్నారని పుత్తూరు 17వ వార్డు ఎస్సీ కౌన్సిలర్ భువనేశ్వరి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే రోజా అవద్దే వద్దు అంటూ… ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అయితే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజా మెడకు 40 లక్షల రూపాయల వివాదం చుట్టుకుంది. అయితే ఈ విషయం సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్లిందట. కచ్చితంగా గెలవాల్సిన నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో… రోజాకు టికెట్ ఇవ్వాలా లేదా అనేదానిపై సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. (Minister Roja)

Join WhatsApp