MLA Lasya Nanditha death mystery

MLA Lasya Nanditha: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం చాలామందిని కలిచివేస్తుంది.ఈమె తండ్రి సాయన్న గత సంవత్సరం ఫిబ్రవరి 19న మరణించారు.ఇక తండ్రి మరణించాక ఆయన సీటును కూతురు లాస్య నందిత కి కేటాయించింది బీఆర్ఎస్ అధిష్టానం. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 17169 ఓట్ల తేడాతో లాస్య నందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచింది.అయితే ఎమ్మెల్యేగా గెలిచి రెండు నెలలు కూడా కాకముందే లాస్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇక తండ్రి మరణించిన సంవత్సరానికే కూతురు మరణించడంతో వారింట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

MLA Lasya Nanditha death mystery

అంతేకాదు గత ఫిబ్రవరిలో తండ్రి మరణం ఈ ఫిబ్రవరిలో కూతురు మరణంతో అసలు వీరి కుటుంబానికి ఏం జరిగింది అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే కొంతమందేమో లాస్య కి ఎవరో చేతబడి చేయించారని, మరికొంత మందేమో ఆమె టైం బాలేదు యాక్సిడెంట్ జరిగి చనిపోయిందని అంటున్నారు. అయితే ఎమ్మెల్యే లాస్య నందిత డెడ్ బాడీకి గాంధీ హాస్పిటల్లో పోస్టుమార్టం జరిపిన సమయంలో ఆమె కట్టుకున్న 12 తాయత్తులను హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకు అప్పగించారు. అయితే ఈ 12 తాయత్తుల వెనుక రహస్యం ఏమిటి..అసలు అన్ని తాయత్తులు లాస్య ధరించడం వెనుక కారణమేంటి అని చాలామంది ఆరా తీస్తున్నారు.(MLA Lasya Nanditha)

Also Read: Chandrababu: కుప్పం బరిలో భువనేశ్వరి.. చంద్రబాబు సేఫ్ ?

అయితే లాస్య నందిత తన మరణాన్ని ముందుగానే పసిగట్టిందో ఏమో తెలియదు కానీ గత కొన్ని రోజుల నుండి పూజలు, గుళ్ళు, గోపురాలు, దర్గాలు అంటూ తిరుగుతోందట. ఇప్పటికే ఆమె రోడ్డు ప్రమాదం నుండి రెండుసార్లు బయటపడిందట.కానీ మూడోసారి బయటపడలేక పోయింది. అయితే తనకి ప్రాణాపాయం ఉందని గ్రహించిన లాస్య నందిత స్వామీజీలు, బాబాలు అంటూ ఇలా తిరగని గుడి,దర్గా లేదు అని తెలుస్తోంది. ఇక 23వ డేట్ రోజు కూడా ఆమె దర్గాకి వెళ్లి వస్తుండగానే ఆ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

MLA Lasya Nanditha death mystery

పూజలు,దర్గాలు, తాయత్తుల వల్ల తన ప్రాణాలను కాపాడుకోవాలి అని ఆశతో ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ సెంటిమెంట్ ఏమి లాస్య నందిత కి వర్కౌట్ అవ్వలేదు.చివరికి కారు ప్రమాదంలో మరణించింది. అయితే ఈమెకి యాక్సిడెంట్ అవ్వడంలో డ్రైవర్ నిద్ర మత్తే కారణం అని పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఈ విషయం తెలిసిన చాలా మంది మాత్రం వీరి కుటుంబానికి ఏదో జరిగిందని, అందుకే గత సంవత్సరం ఫిబ్రవరిలో తండ్రి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కూతురు మరణించిందని అనుమాన పడుతున్నారు.(MLA Lasya Nanditha)

Join WhatsApp