MLC Kavitha was arrest in delhi liquer scam

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితురాలు కవిత అంటూ గత కొద్ది రోజులుగా రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటికే కవిత పేరు చాలాసార్లు వినిపించినప్పటికీ అరెస్టు చేయకపోవడంతో బీజేపీ,బీఆర్ఎస్ ఒక్కటేనని అందుకే కవితను అరెస్టు చేయడం లేదు అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. కానీ బీజేపీ పార్టీ మాత్రం తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కూడా కవితను లిక్కర్ స్కాంలో అరెస్టు చేయకపోవడానికి కారణం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా కవిత పేరు లిక్కర్ స్కామ్ లో వినిపించడం లేదు.

MLC Kavitha was arrest in delhi liquor scam

కానీ తాజాగా కవిత పేరు లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా వినిపించడంతో ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు ఇన్ని రోజులుగా కవిత పేరు బయట పెట్టకుండా తాజాగా కవిత పేరును మళ్లీ తెరమీదకి తీసుకురావడం వెనుక ఏదో వ్యూహం ఉందని, పార్లమెంట్ ఎన్నికల్లో సింపతి పొందడం కోసమే మళ్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరుని హైలెట్ చేస్తున్నారని తెలుస్తోంది.అయితే ఇప్పటికే కవిత మూడుసార్లు సిబిఐ విచారణకు హాజరైంది. ఒకవేళ ఇప్పుడు గనక సిబిఐ విచారణకు పిలిస్తే ఖచ్చితంగా అరెస్టు చేస్తారని తెలుస్తోంది. అయితే కవిత అరెస్టు అయిన కూడా బీఆర్ఎస్ కి నష్టమేమీ లేదని,లాభమే చేకూరుతుందని సమాచారం. (MLC Kavitha)

Also Read: Pawan Kalyan: చంద్రబాబుకు షాక్‌..టీడీపీకి పవన్‌ గుడ్‌ బై ?

ఎందుకంటే కవిత అరెస్టు అయితే తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ సింపతి పెరిగి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు పడతాయి అని భావిస్తున్నారు. ఈ కారణంతోనే ఇన్ని రోజులుగా మూలన పడిపోయిన కవిత పేరు ని మళ్లీ హైలెట్ చేస్తున్నారని,ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి చేసే ప్లాన్ లో భాగమేనని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే చాలామంది పేర్లు బయటపడ్డాయి.ఇందులో కవిత కూడా ఒకరు.అయితే తన కూతురు కవితపై లిక్కర్ స్కాం కేసుని కొట్టివేయించడానికి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాలనుకున్నారు. కానీ లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అది కుదరడం లేదు.

 MLC Kavitha was arrest in delhi liquer scam

అలాగే లిక్కర్ స్కాం లో కవితని నిందితురాలుగా భావిస్తూ సిబిఐ విచారణకు రావాలని తాజాగా నోటీసులు జారీ చేశారు.ఇక విచారణకు వెళ్తే కవితను అరెస్టు చేస్తారు.అరెస్టు అయితే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై సింపతి పెరిగి ఎక్కువ సీట్లు గెలుస్తారు. అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్టు చేసి అనుకున్న మాట నిలబెట్టుకున్నామని వీళ్లు కూడా రాష్ట్రంలో ఎన్నో కొన్ని సీట్లు గెలుస్తారు. ఇక వీరిద్దరూ ఆడిన ఈ డ్రామాలో కాంగ్రెస్ బలి పశువు అవుతుంది. ఫలితంగా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్న టార్గెట్ అయినా 10నుండి 14 ఎంపీ సీట్లకు కచ్చితంగా చెక్ పడుతుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో..(MLC Kavitha)

Join WhatsApp