will he be the Prime Minister in BJP

Modi: భూటాన్ లో మోడీ రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసిపోయింది అక్కడి ప్రభుత్వ పెద్దలు మోడీకి అత్యంత గౌరవ మర్యాదలను ఇస్తున్నారు. ఇక పర్యటన తర్వాత భూటాన్ నుండి శనివారం బయలుదేరిన ప్రధాని భూటాన్ రాజు కి కృతజ్ఞతలు చెప్పారు. ఇది ఇలా ఉంటే మోడీ తిరుగు ప్రయాణం అవుతుండగా భూటాన్ రాజు సాగనింపడానికి విమానాశ్రయం కి వచ్చారు గ్రాండ్గా మోడీకి వీడ్కోలు పలికారు. భూటాన్ పర్యటనపై మోడీ తన అధికారిక ఎక్స్ ఖాతా లో భూటాన్ రాజుకి కృతజ్ఞతలు చెప్పారు ఢిల్లీకి బయలుదేరినప్పుడు విమానాశ్రయానికి వచ్చినందుకు భూటాన్ రాజు కి ధన్యవాదములు అని మోడీ చెప్పారు.

Modi Bhutan tour

మీ నుండి పొందిన ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను హిజ్ మేజిస్టి ది కింగ్ బుటాన్ లోని ఇతర ప్రముఖుల్ని కలిసే అవకాశం లభించిందని గుర్తు చేశారు. అక్కడ ప్రజల ఆప్యాయతలని ఆతిథ్యం మర్చిపోలేదని అన్నారు. మన మధ్య జరిగిన చర్చ భారత్ భూటాన్ మధ్య స్నేహానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆకాంక్షించారు. దేశత్యున్నత పౌర పురస్కారం ప్రధానం చేసినందుకు కృతజ్ఞతలు అని చెప్పారు. భూటాన్ కి భారత్ ఎల్లప్పుడూ నమ్మకమైన స్నేహితుడిగా భాగస్వామిగా ఉంటుందని మోడీ అన్నారు.

Also read: Lenovo tab M11: అద్భుత డిస్ప్లేతో త్వరలో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ దింపులో గేట్ సున్ జడ్సన్ పెమ వాంగ్చుక్ తల్లి పిల్లల ఆసుపత్రిని ప్రారంభించారు. ఆధ్యాత్మిక సదుపాయాలతో ఆసుపత్ర నిర్మాణానికి పూర్తి నిధులు సమకూర్చినందుకు భారత ప్రభుత్వానికి భూటాన్ ప్రధాని కృతజ్ఞతలు చెప్పారు. భూటాన్ 13వ పంచవర్ష ప్రణాళిక కోసం ప్రధాన నరేంద్ర మోడీ 10,000 కోట్లు సహాయ ప్యాకేజీని ప్రకటించారు. ఇది రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసింది మోడీ చేసిన ఈ సహాయానికి భూటాన్ ప్రధాని ఆయన మోడీ ని అన్నయ్యగా భావిస్తున్నానని చెప్పారు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద ట్రక్ గెల్పో లభించింది ఈ అవార్డు ని అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేత మోడీ కావడం విశేషం (Modi).

will he be the Prime Minister in BJP
Join WhatsApp