will he be the Prime Minister in BJP

Modi: ప్రధాని నరేంద్ర మోడీ అవినీతిపరుల భరతం పడతారని, కఠినంగా వ్యవహరిస్తున్నారని లిక్కర్స్ స్కామ్ లో కేసీఆర్ కూతుర్ని జైలుకు పంపించడం ఖాయమని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌదరి అన్నారు. పటాన్చెరు పట్టణంలో జరిగిన విజయ సంకల్ప సభ సమావేశం లో శుక్రవారం ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పాండవులు కౌరవులు మతియుత్తంగా అభివర్ణించారు పార్లమెంట్ ఎన్నికల్లో కౌరవులు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి పాండవుల బీజేపీ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 400 పైగా పార్లమెంట్ స్థానాలని సాధించి నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి అధికారంలోకి మరోసారి వస్తుందని అన్నారు.

Modi BJP leaders comments on BRS

అయోధ్యకి శ్రీరాముడు వలె మెదక్ పార్లమెంట్ కి రఘునందన్ ఉన్నాడని వచ్చే ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పటాన్చెరు ప్రాంతానికి పుష్కలమైన వనరులు ఉన్న అభివృద్ధి చేసే విజన్ ఉన్న నాయకుడు లేకపోవడంతో ఈ ప్రాంతం వెనుకబడిందని అన్నారు. అభివృద్ధి చెందాలని సంకల్పం తో తాను అసెంబ్లీలో ఔటర్ రింగ్ రోడ్డు కి రేడియల్ రోడ్లు నిర్మించాలని లేవనెత్తిన విషయాన్ని గుర్తు చేశారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ 2018లో కేసీఆర్ మాటలను పునరావృత్తం చేస్తుందని మండిపడ్డారు.

Also read: Maruti Suzuki: చిన్న ఫ్యామిలీకి సెట్ అయ్యే కారు..లీ”24కీ”మీ మైలేజ్.!

14 పార్లమెంట్ స్థానాలు గెలిపిస్తేనే ఆరు గ్యారెంటీలని అమలు చేస్తామని చెప్పడం ప్రజల్ని మోసం చేయడం అని అన్నారు. కేసీఆర్ తప్పిదాలకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని దొంగ హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేస్తున్న అబద్ధపు హామీలు ఇచ్చినా మరోసారి ప్రధాన నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వస్తుందని అన్నారు తనకి ఎంపిక అవకాశం కల్పిస్తే ఈ ప్రాంతాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి తో పాటుగా తదితరులు పాల్గొన్నారు (Modi ).

will he be the Prime Minister in BJP
Join WhatsApp