will he be the Prime Minister in BJP

Modi: ప్రతిపక్ష ఇండియా కూటమి వన్ ఇయర్ వన్ పీఎం అనే ఫార్ములా మీద చూస్తోందని దాని వలన దేశానికి చాలా నష్టం జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఒక్కో సంవత్సరం ఒక్కో నాయకుడు పీఎం అయితే దేశం బలోపేతం అయ్యే అవకాశం ఉండదని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకి అధికారం మీద ధ్యాస కాబట్టి దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి కూడా వెనుకాడరని నరేంద్ర మోడీ అన్నారు. అటువంటి ప్రతిపక్ష కూటమికి ఎన్నికల్లో ఓటు వేయాలా వద్దా అనేది ప్రజలే తెలుసుకోవాలని అన్నారు. ప్రముఖ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కీలక కామెంట్స్ చేశారు.

Modi comments on BRS and congress

ఒకప్పుడు 400 లోక్సభ సీట్లు ని గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ లో కనీసం మెజారిటీకి అవసరమైన 272 స్థానాల్లో పోటీ చేయలేని విధంగా బలహీన పడిపోయిందనే ప్రధానమైన నరేంద్ర మోడీ అన్నారు. కూటమిలోనే ఏ ఒక్క పార్టీకి కూడా పెద్దగా ప్రజాదారణ లేదని అన్నారు దేశానికే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి సుస్థిర ప్రభుత్వం బలమైన నాయకత్వాన్ని ఇచ్చే బిజెపికి అండగా నిలవాలని ప్రజల్ని మోదీ కోరారు. 2014లో ప్రజలకు తన మీద ఉన్న నమ్మకం 2019 నాటికి విశ్వాసం గా మారిందని 2024 కి విశ్వాసం కాస్త గ్యారెంటీగా మారిపోయిందని ప్రధాని అన్నారు. పదేళ్ల పాలన అనుభవంలో ఏది సాధ్యమో ఏది అసాధ్యమో తనకి స్పష్టంగా తెలిసింది అని చెప్పారు.

Also read: Mahesh Babu: చిన్న కారణంతో ఏడాదిన్నర ఆడిన సినిమాని రిజెక్ట్ చేసిన మహేష్ బాబు..!

గ్యారెంటీలు ఇవ్వాలంటే పెద్ద తపస్సు చేయాలని మాట్లాడిన ప్రతి మాట గ్యారెంటీగా ఉండాలని మోడీ అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయని ప్రధాని కుండ బద్దలు కొట్టారు అవినీతిలో పథకాలు ఇస్తే తెలంగాణలోనే కాంగ్రెస్ సర్కార్ కి గోల్డ్ మెడల్ బీఆర్ఎస్ కి సిల్వర్ మెడల్ వస్తాయని అన్నారు. ఏపీ ప్రజల్లోని మార్పు కనబడుతోందని ప్రధాని అన్నారు పొత్తులు అనేవి ఎన్నికల రాజకీయాలకే పరిమితం చేయరాదు దేశంలోని ప్రాంతీయ రాజకీయ ఆకాంక్షాలకి సంపూర్ణ గౌరవం దక్కాలని నా అభిమతం అని మోడీ అన్నారు (Modi).

will he be the Prime Minister in BJP
Join WhatsApp