Nara Bhuvaneshwari Contesting As Vijayawada MP

Nara Bhuvaneshwari: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈనెల చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. రెండు విడుదల లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇలాంటి నేపథ్యంలో అధికార వైసిపి పార్టీ సిద్ధం పేరుతో సభలో నిర్వహించుకుంటూ ముందుకు సాగుతోంది. అటు జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు పొత్తుతో ముందుకు వెళుతున్నాయి.Nara Bhuvaneshwari

Nara Bhuvaneshwari Contesting As Vijayawada MP

దాదాపు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కరారు అయినట్టే తెలుస్తోంది. ఇక పానకంలో పుడకలాగా ఇటీవల వైయస్ షర్మిల ఏపీ రాజకీయాలలో అరంగేట్రం చేశారు. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన సతీమణి అయిన నారా భువనేశ్వరిని… రాజకీయాలలోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారట.

Also Read: Thatikonda Rajaiah: వరంగల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య ?

వచ్చే ఎన్నికలలోనే ఆమెను ఎంపీగా నిలబెట్టేందుకు చంద్రబాబు వ్యూహరచనలు చేస్తున్నారట. ఈ మేరకు ఆమెకు సీటు కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ పార్లమెంటు టికెట్ నారా భువనేశ్వరికి ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. గతంలో కేశినేని నాని టిడిపి తరఫున విజయవాడ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే వైసిపి పార్టీలోకి కేశినేని నాని వెళ్లారు. ఆయన వెళ్లడంతో పాటు… క్యాడర్ కూడా కాళీ చేయించేశారు.

వైసీపీ పార్టీలోకి వెళ్లిన తర్వాత కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో తనపై చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కూడా… గెలవడని సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్ చంద్రబాబు నాయుడు స్వీకరించినట్లు సమాచారం అందుతుంది. తాను కాదు కదా తన భార్యతోనే.. కేశినేని నానిని ఓడించాలని చంద్రబాబు నాయుడు పట్టు పట్టారట. అందుకే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో నానా భువనేశ్వరికి విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

దీనికి నారా భువనేశ్వరి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ నారా భువనేశ్వరి పోటీ చేస్తే.. సెంటిమెంట్ ప్రకారం ఆమె చాలా ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంది. ఒకవేళ నారా భువనేశ్వరి గెలిస్తే.. కేశినేని నానికి గట్టి పంచ్ ఇచ్చినట్లు అవుతుంది. ఒకవేళ ఓడిన కూడా… టిడిపికి అలాగే తెలుగుదేశం పార్టీకి పెద్ద ఫరక్ పడదు. అందుకే నారా చంద్రబాబు నాయుడు ఈ దిశగా ఆలోచన చేస్తున్నారట.

Join WhatsApp