Nara Bhuvaneshwari Contesting As Vijayawada MP

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో… కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ల కోసం అన్ని పార్టీల నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా ఈసారి ఏదో ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా గెలవాలని ఆశిస్తున్నారు. ఇక పార్లమెంటు ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మార్చి 20 లోపు ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.

Nara Bhuvaneshwari Contesting In Kuppam chandrababu is safe

అయితే ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గ నుంచి చంద్రబాబు నాయుడు గెలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఏనాడు కుప్పం నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళలేదు. అలాగే అభివృద్ధి కూడా కొంత మేర చేశారు చంద్రబాబు నాయుడు. కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత… కుప్పం నియోజకవర్గాన్ని మరింత డెవలప్ చేశారు. గతంలో చంద్రబాబు ఎక్కడ చేయని విధంగా నూతన హంగులతో తీర్చిదిద్దారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

Also Read: Pawan Kalyan: నాగబాబు కేంద్ర మంత్రిగా… పవన్ కళ్యాణ్ ప్లాన్ అదుర్స్….!

అయితే… ఈసారి ఎన్నికలలో చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో గెలవడం కష్టమని కొన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. డోర్ బై సిచువేషన్ ఉంటాయని కూడా స్పష్టం చేశాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతుంది. కుప్పం బరిలో తన భార్య నారాబు భువనేశ్వరిని బరిలోకి దింపేందుకు… చంద్రబాబు ఆలోచన చేస్తున్నారట. తన భార్యను దింపితే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట.

అంతేకాకుండా ఒక మహిళ చేతిలో వైసిపి పార్టీ ఓడిపోతుందని సంకేతాన్ని జనాల్లోకి తీసుకుపోయేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో జరిగిన అన్ని కిందిస్థాయి ఎన్నికలలో వైసీపీ పార్టీ విజయం సాధించింది. పంచాయతీ వార్డు నుంచి అక్కడ ఉన్న అన్ని స్థాయిలలో వైసిపి పార్టీ మంచి పట్టు సాధించింది. అంతేకాకుండా కుప్పంలో గెలిచిన వైసిపి అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తామని కూడా సీఎం జగన్ ప్రకటించేశారు. దీంతో చంద్రబాబు విజయం కుప్పంలో అసాధ్యమని తేలిపోయింది. ఈ తరుణంలో తన భార్యను బరిలోకి దింపుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.Chandrababu

Join WhatsApp