మా ఓటు మాత్రం జగన్ కే అంటున్న వృద్ధులు. వాలంటీర్లు ఉన్నపుడు మా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు చంద్రబాబు వల్ల 5km దూరంలో ఉన్న బ్యాంక్ దగ్గర క్యూలో నిలబడాల్సి వస్తుంది ఆవేదన చెందుతున్నారు అవ్వతాతలు. పొద్దున్న 7 గంటలకు బ్యాంకి వెళ్లి.. 11 గంటల వరకు Qలో నిలబడి ఉంటే.. 12 గంటలకు సర్వర్ పనిచేయుట లేదు అంటూ బోర్డు పెట్టారు..

ఇంత ఎండలో నిలబడి గంటలు వెయిట్ చేసినా ఫలితం లేదు మళ్ళీ రేపు రమ్మంటున్నారు.. రేపు అయిన ఇస్తారో లేదో.. దీనికి కారణం చంద్రబాబే అంటూ చంద్రబాబు, టీడీపీని తిడుతున్న అవ్వతాతలు. మొదటినుంచీ చంద్రబాబు తీరే అంతుంది.. కంచం నిండా పెట్టినట్లు ప్రచారం చేస్తారు..చివరకు చేతిలో చిటికెడు దులిపేసి..నీకు ఇది ఇవ్వడమే ఎక్కువ అని తప్పించుకుంటారు…

గత ముప్పయ్యేళ్లుగా చంద్రబాబు వ్యవహారశైలిని చూసినవాళ్లకు ఇది స్పష్టంగా తెలుసు… ఇక ఇప్పుడు మ్యానిఫెస్టో విషయంలో కూడా అదే చేస్తారన్నది ప్రజలకు గుర్తుంది.. అందుకే అయన మ్యానిఫెస్టోను సైతం పెద్దగా పట్టించుకోకుండా….ఓస్..ఇంతేనా అని పెదవివిరుస్తున్నారు. ఇవ్వనిదానికి ఎన్ని చెబితే ఏమిలాభం అనేది ప్రజల అభిప్రాయంగా ఉంది. ఇకపోతే పెన్షన్ ల విషయంలోనూ చంద్రబాబు తీరును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది చంద్రబాబు మూర్ఖత్వం అంటున్నారు.

Join WhatsApp