Pavan Kalyan: జగన్ మళ్ళీ గెలిస్తే దేవుడు భూములన్ని కూడా వదిలిపెట్టరని ఎక్కడ స్థలం కనబడితే అక్కడ ఎదేచ్ఛగా కబ్జాలు చేస్తారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం ఉంగుటూరు లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు అలానే కార్యకర్తలు మీద మండిపడ్డారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ప్రచారం లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకుల మీద సీరియస్ అయ్యారు.

Pavan Kalyan warning to YCP

స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. కూటమికి ఓట్లు వేస్తే వేళ్ళు తీసేస్తామని ఓటర్లని వైసిపి నాయకులు బెదిరించినట్లు మా దృష్టికి వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. వాళ్లందరికీ నాయకులని తరిమి తరిమి కొట్టమని ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. కూటమి అభ్యర్థులు కి ఓటు వేస్తే వేలు తీసేస్తారా కొట్టండి అని వేపు చూపిస్తామనుకుంటున్నారా వైసిపి నాయకులు పై నుండి దిగి వచ్చారా..? జనసైనికుల్ని బెదిరించే దమ్ముందా అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Also read: Trisha: ఆ హీరో ని ప్రేమ పేరుతో మోసం చేసిన త్రిష..!

ఓటర్లని మళ్లీ వైసీపీ నాయకులు కార్యకర్తలు బెదిరిస్తే అధికారం లోకి వచ్చిన తర్వాత తాట తీసి ఉంగుటూరు రోడ్లు మీద మోకాళ్ళ మీద నడిపిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాటాకు చప్పుళ్ళకి జనసేన నాయకులు, కార్యకర్తలు భయపడి పోరని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అన్నారు. అలానే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎవరు ఇష్టం ప్రకారం వాళ్లు ఓట్లు వేస్తారని అన్నారు. ఇష్టంగా ఓటు వేసేవారిని బెదిరించారంటే చూస్తూ ఊరుకోమని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఎన్నికలు బాగా హీట్ ఎక్కాయి నాయకులందరూ ప్రచారంతో బిజీగా ఉన్నారు ప్రజల మధ్యకు వెళ్తూ ప్రచారం చేస్తున్నారు ఈసారి ఎన్నికల్లో గెలుపు అనేది చూడాలి (Pavan Kalyan).

Join WhatsApp