Pawan Kalyan Key Plan For Nagababu

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఏ క్షణమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం ఎలాంటి పనులైనా చేసేందుకు సిద్ధమవుతున్నారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan Key Plan For Nagababu

తనను అలాగే తన కుటుంబాన్ని తిట్టిన తెలుగుదేశం పార్టీతో మరోసారి పొత్తు కూడా పెట్టుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏమాత్రం వైసిపి మరోసారి గెలవకూడదన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగానే కొత్త కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. కేంద్రంలో బిజెపి పార్టీతో దగ్గరగా ఉన్న పవన్ కళ్యాణ్… వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు… బిజెపి మరియు తెలుగుదేశం పార్టీలతో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

Also Read: Tdp Vs Ycp: ఏపీలో టీడీపీ, వైఎస్సార్సీపీ కండోమ్ రాజకీయాలు!

వైసిపి పార్టీకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్. దీనికోసం బిజెపి పార్టీ సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. ఇందుకోసం కొత్తలో భాగంగా బిజెపి పార్టీకి ఎక్కువ ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు చంద్రబాబుతో కూడా పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారట. అలాగే ఎంపీ సీట్లలో కూడా బిజెపి పార్టీకి ఎక్కువగా సీట్లు ఇవ్వాలని అనుకుంటున్నారట.

అలా చేస్తే కేంద్ర బిజెపి తమ వైపు ఉంటుందని… ఎన్నికలలో తమకూటమి చాలా ఈజీగా విజయం సాధిస్తుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. అందుకోసమే బిజెపి పార్టీ ఎలాంటి డిమాండ్స్ చేసిన వారితో కలిసి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారట. అయితే ఇక్కడ తన మెగా బ్రదర్ అయిన నాగబాబుకు కీలక పదవి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కండిషన్ పెట్టారట. తాను పార్టీ పెట్టినప్పటి నుంచి తన వెంట నాగబాబు ఉన్నాడని… అందుకే అతనికి కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ బిజెపి పెద్దలకు చెప్పారట. రాజ్యసభ పదవి ఇచ్చి మంత్రిని చేయాలని డిమాండ్ చేశారట పవన్ కళ్యాణ్. దీనికి బిజెపి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

Join WhatsApp