Pawan Kalyan ready to sell seats

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పది సంవత్సరాలు దాటిపోతున్న కూడా ఆయనకు ఏ జిల్లాలో కూడా ఆదరణ లేదు. ఇక పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది ఇతరుల కోసం అన్నట్టుగా పార్టీ పెట్టిన సమయంలో వచ్చిన మొదటి ఎలక్షన్స్ లోనే టిడిపికి బానిసగా మారిపోయి టిడిపి పార్టీకి వత్తాసు పలికారు. ఇక ఒంటరిగా పోటి చేయడం పవన్ కళ్యాణ్ వల్ల కావడం లేదు.అందుకే ఎప్పుడూ టిడిపికే మద్దతు పలుకుతూ ఉంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల్లో డైలాగులు చెప్పినట్టు స్టేజ్ మీద బాగానే మాట్లాడతారు.కానీ ఆయన మాటలకి ఆయన అభిమానులు తప్ప జనాలు ఓట్లు వేయరు.

Pawan Kalyan ready to sell seats

ఇక పవన్ కళ్యాణ్ కి కూటమిలో భాగంగా 21 ఎమ్మెల్యే సీట్లను కేటాయించారు.21 సీట్లలో కేవలం ఆరుగురిని మాత్రమే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అందులో కూడా ఓ ఇద్దరు ముగ్గురుని ఇప్పుడిప్పుడే పార్టీల చేరిన వారికి టికెట్ కట్టబెట్టారు. ఇక ఏ పార్టీ నుండి ఎవరు వస్తారా? ఎవరికి టికెట్ ఇద్దామా అని పవన్ కళ్యాణ్ ఆలోచనలో ఉన్నారట.అంతేకాదు పవన్ కళ్యాణ్ సన్నిహితుల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం..ఆయన మిగిలిన 15 సీట్లని అమ్ముకోవడానికి రెడీ అయిపోయినట్టు టాక్ వినిపిస్తోంది. (Pawan Kalyan)

Also Read: Ys Sharmila: కడప నుంచి ఎంపీగా బరిలో వైఎస్ షర్మిల?

ఎందుకంటే పార్టీలో ఇప్పటికే టికెట్ల గోల మొదలైంది. ఎవరికి టికెట్ ఇచ్చినా ఆశావాహుల నుండి ఆయనకు ఒత్తిడి పెరిగిపోతుందట. అందుకే ఎవరికి ఇవ్వాలో తెలియక అయోమయంలో పడిపోయారట. అంతే కాకుండా తెలంగాణలో బిజెపితో పొత్తు పెట్టుకున్న సమయంలో 8 సీట్లు ఇస్తే ఆ 8 సీట్లు అప్పుడే పార్టీలో చేరిన వారికి డబ్బుల కోసం అమ్ముకున్నట్లు అప్పట్లో టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అదే ఆలోచన చేస్తున్నారట.ఈ 15 సీట్లలో ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి సీటు అమ్మేయాలని ఆలోచన చేస్తున్నారట.

 Pawan Kalyan ready to sell seats

అంతేకాదు మిగిలిన రెండు ఎంపీ సీట్లలో ఒక ఎంపీ సీటు తన కోసం కేటాయించుకొని అక్కడ పోటీ చేసి గెలిస్తే మంత్రి అవ్వచ్చు అనే ఆశతో ఉన్నారట పవన్ కళ్యాణ్. అందుకే మిగిలిన 15 సీట్లను అమ్మేయాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్టు బయట టాక్ వినిపిస్తోంది.అంతేకాదు వేరే పార్టీలో టికెట్ ఆశించి టికెట్ దక్కని ఆశావాహులు చాలామంది పార్టీని వీడుతున్నారు. ఇక అలాంటివారిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ డబ్బు కొట్టు టికెట్ పట్టు అనే ఫార్ములా ఫాలో అయ్యి వారి దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు అమ్ముకుంటున్నారనే టాక్ ఏపీలో గట్టిగా వినిపిస్తోంది.(Pawan Kalyan)

Join WhatsApp