Pawan Kalyan Sensational Comments On TDP Alliance

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు గడుపు దగ్గర పడుతోంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా అధికార వైసిపి పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక అటు తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు జతకట్టి మరి ఈసారి పోటీ చేస్తున్నాయి.

Pawan Kalyan Sensational Comments On TDP Alliance

ఎలాగైనా ఈసారి జగన్మోహన్ రెడ్డిని వడగొట్టాలని… ఆలోచన చేస్తున్నాయి జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు. ఇందులో భాగంగానే పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నాయి. అయితే గతంలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీ మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. కానీ సేవ్ ఆంధ్ర ప్రదేశ్ పేరుతో మళ్లీ కలిసిపోయాయి ఈ రెండు పార్టీలు. ఇక ఎన్నికలకు రెండు నెలల సమయం ఉన్న నేపథ్యంలో… ఈ రెండు పార్టీల మధ్య చీలిక ఏర్పడింది.

Also Read: AP Elections: ఏపీ ఎన్నికలపై సర్వే రిపోర్టు…ఆ పార్టీదే అఖండ విజయం!

చంద్రబాబు ప్రతిరోజు ఏపీలో ఆయా నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు అసెంబ్లీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా మండపేట అభ్యర్థిని టిడిపి ప్రకటించడంపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా స్పందించారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని… ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉందని పవన్ కళ్యాణ్ మీడియా ముందే పెదవి విప్పారు.

అందుకే మేము కూడా రాజోలు మరియు రాజానగరం లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించేశారు పవన్ కళ్యాణ్. అయితే అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు కానీ రెండు నియోజకవర్గాల పేర్లు మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పారు. దీంతో తెలుగుదేశం మరియు జనసేన పార్టీల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అటు గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవుతారని నారా లోకేష్ అన్న వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండించారు పవన్ కళ్యాణ్.

పొత్తు ధర్మంపై మాట్లాడిన వెనువంటనే బిజెపి పార్టీతో పొత్తుకు మళ్ళీ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ లేదా రేపు ఢిల్లీకి పయనం కానున్నారట. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలపై ఎలా ముందుకు వెళ్లాలని దానిపై బిజెపితో పవన్ కళ్యాణ్ చర్చించనున్నారట. ఇక ఈ పరిణామల నేపథ్యంలో ఏ క్షణమైనా టిడిపి మరియు జనసేన పార్టీల మధ్య దోస్తానా కటీఫ్ అవుతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Join WhatsApp