PCC Chief Sharmila Criticizing YS Jagan & Chandrababu But Skipped Pawan Kalyan Why

Sharmila: ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు సరికొత్త ట్విస్టులతో హడలిస్తున్నాయి.. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు సైతం ఏకమవుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది.. ముఖ్యంగా టిడిపి జనసేనతో పొత్తుల బరితో ఎన్నికలలో దిగబోతున్నారు. అయితే వీరితో బిజెపి చేరుతుందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇటివలే pcc చీఫ్ షర్మిల బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న సమయంలోనే తన అన్న సీఎం జగన్ తో పాటు చంద్రబాబును టార్గెట్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గురించి ఏమాత్రం మాట్లాడలేదు.

PCC Chief Sharmila Criticizing YS Jagan & Chandrababu But Skipped Pawan Kalyan Why

ఇలాంటి సమయంలోనే చంద్రబాబును విమర్శించిన టిడిపి కూడా పెద్దగా ఎక్కడ స్పందించలేదు. షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకున్న వెంటనే సీఎం జగన్ రాజకీయంగా టార్గెట్ చేస్తోంది. దీంతో షర్మిల విమర్శలకు సైతం చాలామంది వైసిపి ముఖ్య నేతలు కౌంటర్ ఇస్తున్నారు.. ఇటీవల ఉరవకొండలో జరిగిన సభలో కూడా షర్మిల పేరు ప్రస్తావించకుండానే రాష్ట్రాన్ని విడదీసిన పార్టీలో చేరిన చంద్రబాబు అభినవ సంఘాలు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో షర్మిల ఏపీలో తనకు వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోందని అభిప్రాయాన్ని చేసినట్టుగా తెలుస్తోంది.

Also Read: OnePlus 12: స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌తో వన్‌ప్లస్‌ 12.. సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌లివే..!

బిజెపితో వైసిపి టిడిపికి సంబంధాలు ఉన్నాయని చెప్పిన షర్మిల ఎక్కడా కూడా బిజెపితో మిత్రపక్షంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించలేదు. ఇప్పుడు ఈ విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. టిడిపి నేత చంద్రబాబు నాయుడును విమర్శిస్తే చాలామంది నేతలు సైతం స్పందించేవారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా స్పందించలేదు.. ఇదంతా చేస్తూ ఉంటే అటు షర్మిల ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారారని వార్తలు వినిపిస్తున్నాయి.

PCC Chief Sharmila Criticizing YS Jagan & Chandrababu But Skipped Pawan Kalyan Why

కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకే ఇంత ప్రణాళికలు చేపడుతున్నట్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నిన్నటి రోజున సీఎం జగన్ కూడా ఇండియా టుడే నిర్వహించిన ఎడ్యుకేషనల్ సమ్మిట్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.. అక్కడ అడిగిన ప్రశ్నలకు కూడా సరైన సమాధానాన్ని తెలియజేశారు.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లో షర్మిలను తీసుకోవడం వెనుక కారణాలేంటి అని అడగగా. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి వారు ఇలా చేశారని సమాధానాన్ని ఇచ్చారు.. డర్టీ పాలిటిక్స్ కు పాల్పడడమే కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయిందని రాజకీయ లబ్ధి కోసమే ఆంధ్రప్రదేశ్ ను అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ విడదీసింది అంటూ అందుకే కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేసి బయటికి వచ్చానని తెలిపారు. అలాగే తన కుటుంబం నుంచి తన బాబాయిని మంత్రిని చేసి తనపైనే పోటీకి దించారని ఇప్పుడు మళ్లీ మా కుటుంబాన్ని విడదీసి తన చెల్లెల్ని ఇలా ప్రయోగిస్తున్నారని తెలిపారు. (Sharmila)

Join WhatsApp