Ponguleti, Bhatti preparing to topple the Revanth Reddy government

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ? లేదా ? అనే సందేహం అందరిలో ఉంది. దానికి తగ్గట్టుగానే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పూర్తయిన మరుసటిరోజే అంటే మంగళవారం రోజున… తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూర్చున్న కుర్చీ కాళ్లు పీకేందుకు కాంగ్రెస్ మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు సంసిద్ధమవుతున్నారని ఈ సమాచారం అందుతుంది.. Revanth Reddy

Ponguleti, Bhatti preparing to topple the Revanth Reddy government

దీనికి సాక్ష్యమే మంత్రి పొంగులేటి కేరళ టూర్ అని జోరుగా ప్రచారం అందుకుంది. మంగళవారం రోజున… తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలందరూ కేరళ బాట పట్టారు. ఇందులో భాగంగానే శంషాబాద్ లో ఇండిగో ఫ్లైట్ ఎక్కారు కాంగ్రెస్ నేతలు. అయితే సాంకేతిక సమస్య కారణంగా ఆ ఫ్లైట్ వెళ్లడం ఆలస్యం అయింది. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గ్యాంగ్ చేస్తున్న కుట్రలు బయటపడ్డాయి. Revanth Reddy

Also Read: CM Jagan: వైసీపీకి 100 సీట్లు పక్కా… అక్కడి నుంచే జగన్ ప్రమాణం ?

ఇండిగో ఫ్లైట్ ఆగిపోవడంతో మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే అదే సమయంలో ఆఫ్లైట్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో బయటపడింది. వారందరూ కేరళకు వెళ్లేందుకు సిద్ధమయ్యారట. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం శంషాబాద్ లో ఇండిగో ఫ్లైట్ ఎక్కినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నారు. Revanth Reddy

వీరందరూ కలిసి కేరళలో… రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని… అందుకే ఇలాంటి పన్నాగం కట్టారని వార్తలు వస్తున్నాయి. అయితే వీళ్ళ కథంతా ఒకసారి పక్కకు పెడితే… డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు శ్రీధర్ బాబు ఇద్దరూ రహస్యంగా మహారాష్ట్ర బాడర్ లో కలిశారు. అక్కడ ఒక చిన్న గ్రామంలో రహస్యంగా సమావేశం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సంఘటనలు రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగినట్లు తెలుస్తోంది. Revanth Reddy

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయే ప్రమాదం ఉందని ముందే ఈ నేతలు గ్రహించినట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోతే… రేవంత్ రెడ్డి ని దించేసి..
తమలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలని… ఈ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కారణంగానే ఎంపీ సీట్లు ఓడిపోయామని… సోనియాగాంధీకి ఈ గ్యాంగ్ చెప్పే ప్రయత్నం చేస్తుందట. ఫలితాలు వెలువడిన తర్వాత… రేవంత్ రెడ్డిని దించేసి… భట్టి విక్రమార్క, లేదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కుట్రలు చేస్తున్నట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరోసారి కుమ్ములాట మొదలైందని స్పష్టమైంది. Revanth Reddy

Join WhatsApp