Ponguleti srinivas sketch to topple the Congress government

Ponguleti Srinivas: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్గా సాగుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేవలం 64 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్… అధికారాన్ని చేపట్టింది. అయితే కాంగ్రెస్కు తగ్గట్టుగానే గులాబీ పార్టీ 39 సీట్లు గెలుచుకొని బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తమ హామీలను నెరవేర్చడంలో దారుణంగా విఫలమైంది. Ponguleti Srinivas

Ponguleti srinivas sketch to topple the Congress government

దీనికి తగ్గట్టుగానే గులాబీ పార్టీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తుంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది లీడర్లు రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క… ఖమ్మం ఎంపీ సీటు విషయంలో మొండి పట్టు పట్టారు. అటు నల్గొండ నియోజకవర్గంలో కోమటి రెడ్డి బ్రదర్స్ కూడా అద్దంకి దయాకర్ కు ఎలాంటి పదవి రాకుండా అంటుకుంటున్నారు. ఇక ఇటు తుమ్మల నాగేశ్వరరావు… డైరెక్ట్ గానే రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారు. Ponguleti Srinivas

Also Read: Kadapa: కడపలో షర్మిల వర్సెస్ భారతి..ముల్లును ముల్లుతోనే తీస్తున్న జగన్‌ !

ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిగ్ ప్లాన్ వేశారట. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే చర్చ జరుగుతోంది. బిజెపితో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ఆలోచన చేస్తున్నారట. అంతే కాదు ముఖ్య మంత్రి పదవి చేపట్టాలని ఆశతో శ్రీనివాసరెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారట. ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్ష వాచ్ ల కుంభకోణంలో అడ్డంగా బుక్కయ్యాడు. అయితే ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకువచ్చారని ప్రచారం జరుగుతుంది. Ponguleti Srinivas

దీంతో కోపంతో రగిలిపోతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి… రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలని అనుకుంటున్నారట. అందుకే ఇటీవల భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ను కూడా పార్టీలో చేర్చుకున్నారట. అతనితో కలిసి మరో 19 మంది ఎమ్మెల్యేలను బిజెపిలో కలపాలని పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి స్కెచ్ వేశారట. అలాగే మరి కొంతమంది ఎమ్మెల్యే లను కూడగట్టి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు స్కెచ్ వేశారట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.Ponguleti Srinivas

Join WhatsApp