Ponguleti Srinivas will become telangana cm as like eknadh sinde

Ponguleti Srinivas: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోననే టెన్షన్ అందరిలోనూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తక్కువ సీట్లతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎదురు ఈత ఈదుతోంది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడం. ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో నాన కష్టాలు పడుతోంది రేవంత్ రెడ్డి సర్కార్. యాసంగిలో వేయాల్సిన రైతుబంధు నిధులు ఇంకా పడని పరిస్థితి నెలకొంది. Ponguleti Srinivas

Ponguleti Srinivas will become telangana cm as like eknadh sinde

అంతేకాకుండా కరెంటు కోతలు, సాగు అలాగే తాగునీటి సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో విలయతాండవం చేస్తున్నాయి. కాలేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఉన్న మేడిగడ్డను రిపేర్ చేసి నీళ్లు ఇవ్వాల్సింది పోయి… రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు అలాగే నీటి సమస్య విపరీతంగా పెరిగిపోయింది. భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయి. ఇక ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో అనే టెన్షన్ కూడా అందరిలోనూ ఉంది.Ponguleti Srinivas

Also Read: Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌ కు బిగ్‌ షాక్‌..పిఠాపురం బరిలో టీడీపీ అభ్యర్థి ?

ఈ టెన్షన్ నడుమ తాజాగా తెలంగాణ ఉద్యమ నాయకుడు గాద ఇన్నయ్య చేసిన కామెంట్స్ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే కాబోతున్నాడని బాంబు పేల్చారు గాద ఇన్నయ్య. ఏ క్షణమైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపి పార్టీలో చేరతారని… తనతో పాటు సగం ఎమ్మెల్యేలను తీసుకపోతాడని ఆయన వెల్లడించారు. గులాబీ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత బిజెపితో కుమ్మక్కు అయ్యాడని… ఆ ప్లాన్ లో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాయిన్ అయ్యాడని ఆయన ఆరోపణలు చేశారు. Ponguleti Srinivas

ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏ క్షణమైనా బిజెపి పార్టీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దూకుతాడని… భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను కూడా తీసుకుపోతాడని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపి అండతో అవుతారని గాదె ఇన్నయ్య స్పష్టం చేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండేది కూడా కష్టతరమే. అందుకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటినుంచి అలర్ట్ అవుతున్నారని… జాతీయ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం పార్లమెంట్ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు. Ponguleti Srinivas

Join WhatsApp