Prashant Kishor predicts same or bigger majority for NDA

Prashant Kishor: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్షణమైనా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే రామ మందిరం పునః ప్రారంభం, బడ్జెట్లో కీలక అంశాలు పెట్టి ఎన్నికలకు వెళ్లేందుకు ఎన్డీఏ కూటమి సిద్ధమవుతోంది. అటు ఇండియా కూటమి పేరుతో ప్రతిపక్షాలన్నీ కలిసి బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. ఇలాంటి నేపద్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై… పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సంచలనం ప్రకటన చేశారు.

Prashant Kishor predicts same or bigger majority for NDA

వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీట్ చేస్తుందని ఆయన ప్రకటించారు. ఎన్నికల ఫలితాలను చాలా సులువుగా అంచనా వేసే ప్రశాంత్ కిషోర్… తాజాగా ఈ ప్రకటన చేయడంతో దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. అంతేకాకుండా.. ఇండియా కూటమిలో సరైన ప్రతిపక్ష నేత లేడని… ఆ కారణంగా nda కూటమి చాలా సులువుగా గెలుస్తుందని తెలిపారు.

ఇండియా వ్యాప్తంగా nda కూటమికి 335 సీట్లు రావడం జరుగుతుందన్నారు. కేవలం బీహార్ రాష్ట్రంలోనే 40 సీట్లు బిజెపికి వస్తాయని తెలిపారు. అయితే వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జేడీయు పార్టీకి మాత్రం ఘోర ఓటమి తప్పదని హెచ్చరించారు. అయితే ప్రశాంత్ కిషోర్ చెప్పిన విషయాలలో నిజం ఉంది. ఇటీవల రామ మందిరం కేంద్ర ప్రభుత్వం పునః ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఉత్తర భారత దేశంలో… బిజెపికి మరింత బలం పెరిగింది.

Also Read: YS Sharmila: కాంగ్రెస్ లోకి వైయస్ వివేకా కూతురు సునీత…. కడప నుంచి పోటీ ?

అటు లక్ష దీవులు ఎపిసోడ్ కారణంగా కేరళ లాంటి రాష్ట్రాలలో కూడా బిజెపికి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. దక్షిణ భారతదేశంలో కూడా… బిజెపి పుంజుకుంటుంది. కర్ణాటకలో కచ్చితంగా ఎక్కువ సీట్లు గెలిచే ఛాన్స్ ఉంటుంది. అటు చతిస్గడ్ రాష్ట్రంలో బిజెపి క్లీన్ స్వీప్ చేసే ఛాన్స్ కూడా ఉండే అవకాశాలు ఉంది. ఏపీలో ఏ పార్టీ గెలిచిన బిజెపికి సపోర్ట్ ఇస్తారు. ఇది తెలంగాణలో నాలుగు సీట్లు బిజెపి కచ్చితంగా గెలుస్తుంది. ఈ లెక్కన మరోసారి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కావడం చాలా సులువు అవుతుందన్న మాట. మరి ప్రశాంత్‌ కిషర్‌ చేసిన కామెంట్స్‌ ఏ మేరకు నిజం అవుతుందో చూడాలి. (Prashant Kishor)

Join WhatsApp