R. S. Praveen Kumar join to BRS

R. S. Praveen Kumar: R.S. ప్రవీణ్ కుమార్ అంటే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు ఆదర్శం..ఆయన ఓ రిటైర్డ్ ఐపిఎస్ అధికారి..అలాగే అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కి కార్యదర్శిగా ఉన్నాడు.ఈయన ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. ఈయన తెలంగాణలో బహుజన సమాజ్ వాది పార్టీలో చేరి ఎన్నికల్లో కూడా బరిలో నిలిచారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవక పోయినప్పటికీ ఆయనకు యూత్ లో ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.

R. S. Praveen Kumar join to BRS

ఈయన చాలామంది యూత్ లో తన స్పీచ్ తో పట్టుదల, కసిని నింపారు. అయితే అలాంటి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ తో పొత్తు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. స్వయంగా కేసీఆర్ ని కలిసి బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు ప్రకటించారు. అయితే ఈ పొత్తును బీఎస్పి అధినేత మాయావతి ఖండించింది.దాంతో తాజాగా ఆయన బీఎస్పి పార్టీ అధ్యక్షుడిగా కి రాజీనామా చేస్తున్నట్టు మాయావతి కి లేఖ రాశారు. (R. S. Praveen Kumar)

Also Read: Kavitha Arrest: బీఆర్ఎస్ కి కలిసి వస్తున్న కవిత అరెస్ట్..!!

ఇక ఆ లేఖలో ఏముందంటే.. పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ పొత్తులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ముందుకు నడవాల్సిందే. ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొని ముందుకు వెళ్లాలి. నేను నమ్మిన నిజమైన ధర్మం ఇదే. ఇక బీఆర్ఎస్, బీఎస్పి పొత్తు పెట్టుకుంది అని తెలిసినప్పటి నుండి బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును విడగొట్టడం కోసం చేయని ప్రయత్నాలు ( కవిత అరెస్టుతో సహా ) లేవు. ఇక బిజెపి పార్టీ చేస్తున్న దానికి భయపడి నేను నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదిలిపెట్టలేను.

R. S. Praveen Kumar join to BRS

ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా ప్రస్థానాన్ని ఆపలేరు.మళ్లీ చెబుతున్నాను నేను ఎప్పటికీ బహుజన వాదాన్నే నా మనసునిండా పదిలంగా ఉంచుకుంటాను. అంటూ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేసి ఈ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్.. అయితే ఈయన బీఎస్పీ పార్టీకి రాజీనామా చేయడంతో కేసీఆర్ సమక్షంలో త్వరలోనే బీఆర్ఎస్ లో చేరుతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరుతారా లేక చివరి వరకు బీఎస్పీ పార్టీలోనే ఉండిపోతారా అనేది.(R. S. Praveen Kumar)

Join WhatsApp