Revanth Reddy gave a strong warning

Revanth Reddy : కాలేశ్వరం ప్రాజెక్టు కనుక అద్భుతమైతే దమ్ముంటే చర్చకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసిఆర్ హరీష్ రావుకి సవాల్ విసిరారు. ఈరోజు హనుమకొండ జిల్లా మడికొండ లో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభ లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మామ అల్లుడు తోక తగిన బల్లుల్లా ఎగిరి పడుతున్నారని మండిపడ్డారు నిన్న ఒక టీవీ స్టూడియో లో నాలుగు గంటల పాటు కూర్చున్నాడని అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అని రేవంత్ రెడ్డి అన్నారు. అలానే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ ని కెసిఆర్ ముందేసి గీసాడో మరి దిగిపోయాక గీసాడో కానీ అది కాస్త కూలిపోయింది అని రేవంత్ రెడ్డి అన్నారు.

Revanth Reddy challenge to Kcr and Harish rao

అలానే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతం అయితే వెంటనే బహిరంగ చర్చకి రావాలని సవాల్ విసిరారు. పంద్రాగస్టు లోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని రామప్ప శివుడు సాక్షిగా వేయి స్తంభాల గుడి సాక్షిగా భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాట ఇస్తున్నానని అన్నారు రేవంత్ రెడ్డి. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానన్న హరీష్ రావు కామెంట్లు పై రేవంత్ రెడ్డి స్పందించారు.

Also read: Tata Tiago Ev: ఒక్క ఛార్జ్ తో 400కి”మీ”.. అద్భుత ఫీచర్స్.!

హరీష్ రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని రెడీగా ఉండు అంటూ సవాల్ విసిరారు ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసే హరీష్ సంగతి తెలుస్తానని అన్నారు రేవంత్ రెడ్డి. ఆనాడు పెట్రోల్ పోసుకున్న నీకు అగ్గిపెట్టె దొరకలేదా హరీష్ అంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఇలా రేవంత్ రెడ్డి హనుమకొండ జిల్లా మడికొండలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభలో కెసిఆర్ హరీష్ రావు పై సవాల్ విసిరారు. దమ్ముంటే చర్చకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కాలేశ్వరం ప్రాజెక్టు కనుక అద్భుతం అయితే కచ్చితంగా చర్చకి రండి అని రేవంత్ రెడ్డి అన్నారు. (Revanth Reddy)

KCR Comments On Revanth Govt
Join WhatsApp