Cm Revanth Reddy to jail on July 14

Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ను బీజెపికి తాకట్టు పెట్టిందని బీఆర్ఎస్ ఒక దిష్టిబొమ్మను ముందు పెట్టింది తప్ప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అన్నారు. ఈటల రాజేందర్ 2001 నుండి 2021 వరకు కేసీఆర్ తో కలిసి తెలంగాణను విధ్వంసం చేసింది మీరు కాదా అని అన్నారు మీకు పంపకాల్లో పంచాయతీతో విడిపోయారు తప్ప ప్రజల కోసం కాదు అని అన్నారు రేవంత్ రెడ్డి. 2021 లో వరదలు వచ్చి ఈ ప్రాంతం ముంపుకి గురైతే ఆనాడు ఈటల పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు.

Revanth Reddy comments on Eetala

పదేళ్లు మంత్రిగా ఉండి ఎప్పుడైనా ఉప్పల్ కు వచ్చావా అని అడిగారు. నువ్వు ఏం చేస్తావ్ ఏం తెచ్చావని మల్కాజిగిరి ప్రజలను ఓటు అడుగుతున్నామని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఓటు అడిగే హక్కు నీకు లేదని అన్నారు. అంతేకాకుండా రాజేందర్ కేసీఆర్ వేరు వేరు కాదు నాణేనికి బొమ్మ బొరుసు లాంటివారు అని అన్నారు. కేసీఆర్ కాలేశ్వరం పేరుతో దోచుకుంటే ఆర్థిక మంత్రిగా నిధులు విడుదల చేసింది నువ్వు కదా రాజేందర్ అని అన్నారు.

Also read: ఎల్లోమీడియా కుట్రలో పీవీ రమేష్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం మీద ట్వీట్..వెనువెంటనే దిద్దుబాటు!!

కరోనా టైం లో సంతోష్ రావు కోట్లాది రూపాయలని వెనకేసుకుంటే వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నది నువ్వు కాదా నువ్వే కదా దొంగలకు సద్దులు మోసింది అప్పుడే మర్చిపోయావా హైదరాబాద్ చుట్టూ భూములను దోచుకుంటే చూస్తూ ఊరుకుంది నువ్వే కదా..? గద్దర్ ను అవమానించిన నాడు ఎందుకు ప్రశ్నించలేదు? కేసీఆర్ అవినీతిపై ఈటల అమిత్ షా మోదీకి ఫిర్యాదు చేశారా అని రేవంత్ రెడ్డి అన్నారు. అంగీ మార్చినా రంగు మార్చిన ఎన్ని వేషాలు వేసిన రాజేంద్రను ప్రజలు నమ్మరు అని అన్నారు (Revanth Reddy).

Revanth Reddy to jail
Join WhatsApp