Cm Revanth Reddy to jail on July 14

Revanth Reddy : ఇప్పుడు దేశంలో జరుగుతున్న ఎన్నికలు ఆషామాషీ కాదని రిజర్వేషన్లు రద్దు అయ్యే ప్రమాదం ఉందని మెడ మీద కత్తిలా వేలాడుతోంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలను ఆదానీ, అంబానీలకు బానిసలుగా మార్చబోతున్నారని ఆరోపించారు. విశ్వేశ్వర్ రెడ్డి ఇక్కడ వాడే కానీ ఆయన బిజెపి వైపు ఉన్నారని రిజర్వేషన్ల రద్దు ప్రశ్నించిన నా మీద ఢిల్లీ పోలీసులతో కేసులు పెట్టించారు. కేసులకు రేవంత్ రెడ్డి భయపడే వాడు కాదు అని అన్నారు.

Revanth Reddy comments on elections

బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటీష్ జనతా పార్టీ. బ్రిటిష్ వాళ్ళ లాగ మన మధ్య పంచాయతీ పెట్టి రిజర్వేషన్ రద్దు చేయాలని చూస్తున్నారు. బీజేపీ దేవుడుని అడ్డుపెట్టుకొని ఓట్లు దండుకోవాలని చూస్తోంది అయోధ్యలో రాముడి ప్రతిష్టకి 15 రోజులు ముందే అక్షింతలు పంచి దేవుణ్ణి అవమానించారు బిజెపి నేతలకు నేను సవాల్ విసురుతున్నాను నిజంగా రాముడు ప్రతిష్ట జరిగాక అక్షింతలు తెచ్చారని భద్రాద్రి రాముడు పై ప్రమాణం చేయగలరా అని అన్నారు. దేవుడంటే మీకు ఓట్లు రాముడంటే మీకు సీట్లు అని అన్నారు.

Also read: ఎల్లో మీడియా దుర్మార్గానికి ఇది పరాకాష్ట.. ఇది ప్రజలు గమనించాలి!!

హనుమాన్ అంటే మీకు అధికారం కావచ్చు కానీ మాకు రాముడు అంటే నమ్మకం. రాముడికి నమ్మిన బంటు హనుమంతుడిలా మేముంటాం. భక్తి గుండెల్లో ఉండాలి అలాంటి వారే నిజమైన హిందువులని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లిని అడ్డుపెట్టుకుని పదేళ్లు కేసీఆర్ దోచుకున్నారు. తండ్రి, కొడుకు 1000 కోట్లతో ఫామ్ హౌస్ కట్టుకున్నారు టీవీలు పేపర్లు పెట్టుకున్నారని అన్నారు. తెలంగాణ తల్లిని అడ్డుపెట్టుకుని దోచుకున్నవాడు ఒకడైతే రాముడిని అడ్డుపెట్టుకుని దేశాన్ని కొల్లగొట్టి ఆదానీ, అంబానీలకు లక్షల కోట్లు దోచిపెట్టిన వాడు ఇంకొకడు అని అన్నారు (Revanth Reddy).

Revanth Reddy to jail
Join WhatsApp