Revanth Reddy Comments Viral

Revanth Reddy: రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యాక మొట్టమొదటిసారి ఏపీ విశాఖ ప్లాంట్ ని ప్రైవేట్ కరణం చేయకూడదు అనే దానికి నిరసనగా తెలిపిన సభలో పాల్గొన్నారు. ఇక ఈ సభలో ఆయన చేసిన కామెంట్లు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే ఈ సభలో ఆయన 25 ఎమ్మెల్యే సీట్లు ఐదు ఎంపీ సీట్లు మాకు బహుమతిగా ఇవ్వండి .ఏపీలో ఎన్నో అద్భుతాలు తీసుకొస్తాం అని ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం టీడీపీ కి సపోర్టుగా ఉన్నాయని,పక్కనే ఉంటూ షర్మిలను రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడుస్తున్నారంటూ మాట్లాడుకుంటున్నారు.

Revanth Reddy Comments Viral

ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆ పార్టీ నాయకులు మాట్లాడతారు.కానీ రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కేవలం 25 ఎమ్మెల్యే సీట్లు ఐదు ఎంపీ సీట్లు చాలు అని మాట్లాడం కొంతమందికి రుచించడం లేదు. అంతేకాదు రేవంత్ రెడ్డి, చంద్రబాబు కి ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారని, అందుకే తన గురువు చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఓడిపోవాలనే ఉద్దేశంతోనే అలా పరోక్షంగా మాట్లాడినట్టు భావిస్తున్నారు.అంతేకాదు వైయస్ షర్మిలను తెలంగాణలో కలుపుకుపోలేదు.(Revanth Reddy)

Also Read: Ap Elections: మోగిన ఎన్నికల నగరా..ఏపీలో హంగ్‌ ఏర్పాటు..అధికారం ఆ పార్టీకే ?

కానీ ఆంధ్రాలో మాత్రం ఆమెకు సపోర్ట్ చేస్తారంటా.. మిమ్మల్ని ఎవరు నమ్ముతారని వైసిపి అభిమానులు ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.ఇక షర్మిల కు ఏపీలో అండగా ఉంటాం ఆమెనే ys రాజశేఖర్ రెడ్డి వారసురాలు.. ఏపీలో సీఎం చేస్తాం అంటూ రేవంత్ రెడ్డి ఎన్నో పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. ఇక ప్రస్తుతం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తుంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిజమని అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈమధ్య ఒక సభలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు జేబులో ఓ జాతీయ పార్టీ ఉంది. మరో జాతీయ పార్టీతో నేరుగా పొత్తు పెట్టుకున్నారు అంటూ మాట్లాడారు.

Revanth Reddy Comments Viral

ఇక ఈ లెక్కన నేరుగా పొత్తు అంటే బిజెపి పార్టీతో,జేబులో జాతీయ పార్టీ అంటే కాంగ్రెస్ అని అందరూ అనుమాన పడుతున్నారు. అంతే కాదు రేవంత్ రెడ్డి పరోక్షంగా టిడిపికి సపోర్ట్ చేస్తూ షర్మిల తో ఉన్నట్టుగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుక సీఎం అవ్వాలని కోరుకుంటున్నారని, అందుకే కేవలం 25 చోట్ల ఎమ్మెల్యేలు ఐదు చోట్ల ఎంపీలు గెలిస్తే చాలని అంటున్నారని రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు.ఇక రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాటల్లో అంతరార్థం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏపీలో గెలవకూడదు అనే అనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ గెలవాలని ఎక్కడా కూడా మాట్లాడడం లేదు.(Revanth Reddy)

Join WhatsApp