Revanth Reddy got fired on KCR

Revanth Reddy: గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రద్దీ బాగా పెరుగుతోంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ఈ ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణలోని పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. జిహెచ్ఎంసి పోలీస్ విభాగాలు సమన్వయంతో ప్రణాళికలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది.

Revanth Reddy comprehensive plan for future needs

హైదరాబాద్ లో ట్రాఫిక్ నిర్వహణ నియంత్రణ మీద బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షని జరిపారు హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ అలానే నిర్వహణ మీద సమగ్ర ప్రణాళికని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అందుకోసం నిపుణులైన వాళ్ళ కి బాధ్యతలని అప్పగించాలని ప్రత్యేకంగా అధ్యయనం చేయించాలని కూడా చెప్పారు పెరిగిన వాహనాల సంఖ్యకి అనుగుణంగా ట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో లేరని చెప్పారు స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని అన్నారు మూడు నెలల్లోగా ఈ నియామకాలు జరిగేలా చూసుకోవాలని అన్నారు కొత్తగా నియమించిన వారికి తగిన శిక్షణను ఇవ్వాలని సూచించారు.

ఈ లోగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న హోంగార్డులకి ట్రాఫిక్ విభాగాలకు తిరిగి రప్పించాలని అలానే తక్షణమే వారి సేవలను వినియోగించుకోవాలని అన్నారు ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉండే సమయాల్లో లా అండ్ డాటర్ పోలీస్ లైనింగ్ గ్రేటర్ సిటీ ట్రాఫిక్ కంట్రోల్ విధులకు వినియోగించుకోవాలని అన్నారు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనర్ రేట్ల పరిధిలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో స్థాయిని అప్గ్రేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. సిటీలోని అన్ని ప్రధాన జంక్షన్లో అలానే రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ట్రాఫిక్ సిబ్బంది తప్పకుండా ఉండేటట్టు ఏర్పాటు చేయాలని అన్నారు కేవలం ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడకూడదని చెప్పారు (Revanth Reddy).

Revanth Reddy Talks about Beloved Film Star
revanth reddy
Join WhatsApp