Revanth Reddy secret deal with Owaisi

Revanth Reddy: రాష్ట్రంలో,దేశంలో ఎక్కడైనా సరే ఒక పార్టీ అధికారంలోకి వస్తే మిగిలిన చిన్న పార్టీలన్నీ ఆ అధికార పార్టీతో రహస్య ఒప్పందాలు పెట్టుకుంటూ ఉంటాయి. ప్రతిపక్ష పార్టీ మినహా మిగిలిన బలహీన పార్టీలన్నీ ఆ పార్టీతో కలవాలి అనుకుంటాయి. అయితే ఈ తంతు దేశంలో,రాష్ట్రంలో ఎక్కడైనా జరుగుతుంది. అయితే తాజాగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్, బిజెపి నాయకులు,ఇతర పార్టీల కార్యకర్తలతో పాటు చాలామంది కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కూడా బీఆర్ఎస్ ని పూర్తిగా ఖాళీ చేయడమే.

Revanth Reddy secret deal with Owaisi

ఇక పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ తో ఫ్రెండ్షిప్ చేసింది ఓవైసీ. అయితే అనూహ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ కి పరోక్ష మద్దతు ఇస్తుంది ఓవైసీ.అయితే తాజాగా కాంగ్రెస్ ఓవైసీ మధ్య రహస్య ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. ఇక అసలు విషయం ఏమిటంటే.. రేవంత్ రెడ్డి ఓవైసీ అధినేత అసదుద్దీన్ ఇద్దరు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల హడావిడి కనిపిస్తోంది.(Revanth Reddy)

Also Read: KTR: ఆ కేసులో కేటీఆర్ అరెస్ట్.. బీఆర్ఎస్ కి హరీష్ రావే దిక్కు..?

అయితే ఓవైసీకి కంచుకోటగా ఉన్న హైదరాబాదులో కాంగ్రెస్, బీజేపీ తరఫున ఎవరు పోటీలో నిలబడుతున్నారు అనేది ఆసక్తికరంగా ఉంది.ఇక ఇప్పటికే బీజేపీ నుండి మాధవి లతను హైదరాబాద్ లో ఖరారు చేశారు.అయితే ఓవైసీకి ఓట్లు ఎక్కువ పడాలంటే కచ్చితంగా కాంగ్రెస్ సపోర్ట్ కావాలి. ఈ నేపథ్యంలోనే ఓవైసీ అధినేత అసదుద్దీన్ రేవంత్ రెడ్డికి ఓ విజ్ఞప్తి చేశారట.అదేంటంటే..హైదరాబాద్ ఎంపీ సీట్ విషయంలో తమకి సహాయం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల మద్దతు పూర్తిగా మీకే ఉంటుంది అని చెప్పారట..

Revanth Reddy secret deal with Owaisi

అంతేకాదు ఇక్కడ కాంగ్రెస్ తరపు నుండి బలహీన అభ్యర్థిని నిలబెడితే మాకు కాస్త ఓట్లు ఎక్కువ వస్తాయి అని చెప్పారట. రేవంత్ రెడ్డి కూడా ఓవైసీకి గత కొద్దిరోజులుగా దగ్గర దగ్గరగా ఉంటున్నట్టు తెలుస్తోంది.దాంతో అసురుద్దీన్ తో రహస్య ఒప్పందం కుదుర్చుకొని బలమైన అభ్యర్థులను కాకుండా బలహీన అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తున్నారట.అయితే ఇప్పటికే హైదరాబాద్ పార్లమెంట్ బరి నుండి కాంగ్రెస్ లో ఫిరోజ్ ఖాన్,సానియా మీర్జా వంటి బలమైన నేతల పేర్లు వినిపించినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం అక్కడ బీసీ నాయకున్ని నిలబెట్టి మజ్లీస్ పరోక్షంగా సపోర్ట్ ఇవ్వాలని చూస్తున్నారట.(Revanth Reddy)

Join WhatsApp