Revanth Reddy's re-entry into AP politics

Revanth Reddy : భువనగిరిలోని ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్లు చూశారు. కేసీఆర్ హైదరాబాద్లోని ఆంధ్ర వాళ్ళని బెదిరించి లక్షలు వసూలు చేశారని అన్నారు. తెలంగాణ సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన ఘనత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అన్నారు 2009లో ఢిల్లీ దద్దరిళ్లేలా తెలంగాణ నినాదాన్ని వినిపించి పార్లమెంట్ స్తంభింపజేసి 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సాధించారని చెప్పారు. కోమటిరెడ్డి నిబద్ధత గల కాంగ్రెస్ సైనికులు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మాజీ సీఎం కేసీఆర్ రాజీనామా డ్రామాలో ఉప ఎన్నికలు తీసుకువచ్చి హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేశారని అన్నారు.

Revanth Reddy supporting komati Reddy

దొరవారి గడిలో సారా పోసిన వ్యక్తి జగదీశ్ రెడ్డి అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎవరికైనా నాతోపాటు ముఖ్యమంత్రి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని కోమటిరెడ్డి బ్రదర్స్ నాకు కూడా ఎడమ భుజాలు అని అన్నారు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీకి డబల్ ఇంజన్స్ అని అభివర్ణించారు. పార్టీ నిర్ణయంతో దానికి ముఖ్యమంత్రి పదవి వచ్చిందని పదవిని బాధ్యతగా చూసానని అహంకారంతో వ్యవహరించలేదని అన్నారు పేదవాడు సంక్షేమం కోసం అలానే తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిని అవ్వకముందు కార్యకర్తలు ఎలా కలిశారో సీఎం అయిన తర్వాత కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కలుస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులని నేతలని కేసీఆర్ ఎప్పుడూ గౌరవించలేదని రేవంత్ రెడ్డి అన్నారు రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా కూటమి అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని చెప్పారు.

Also read: Oppo Reno12: 50ఎంపీ కెమెరా..అద్భుత ఫీచర్స్.!

కాంగ్రెస్ ని ఎందుకు ఓడించాలో సీఎం కేసీఆర్ చెప్పాలని అన్నారు సంక్షేమంతో దూసుకు వెళ్తుంటే కేసీఆర్ మాత్రం ప్రభుత్వం కూలిపోతుందని శాపనార్ధాలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. మోడీ దెబ్బకి ప్రజాస్వామ్య వ్యవస్థలు కుప్పకూలిపోయాయని దేశాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటున్నారని అన్నారు. అలానే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోడీ కి కేసీఆర్ అన్ని విషయాల్లో మద్దతు ఇచ్చారని అన్నారు బిఆర్ఎస్ బిజెపిని బొంద పెట్టాలని ప్రజలని కోరారు ఒకవేళ కనుక మా జోలికి వచ్చారంటే కోమటిరెడ్డి బ్రదర్స్ బొంద పెడతారని రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ ఏర్పాటు నరేంద్ర మోడీ తప్పు పడుతున్నారని బిజెపికి ఓటు అడిగా అర్హత లేదు అని రేవంత్ రెడ్డి చెప్పారు (Revanth Reddy).

Revanth Reddy gave a strong warning
Join WhatsApp